ప్రజా సమస్యల పరిష్కారం కొరకే మీట్ యువర్ ఎస్పీ: ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ జిల్లా:ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కొరకే మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.నల్గొండ జిల్లా చింతపల్లి మండల పోలీస్ స్టేషన్ ను ఎస్పీ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి పెండింగ్లో ఉన్న కేసులను చూసి సుదూర ప్రాంతాల ప్రజలకు మండల స్థాయిలోనే పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 Meet Your Sp To Resolve Public Issues Sp Sarath Chandra Pawar, Meet Your Sp Prog-TeluguStop.com

పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు,పోలీస్ స్టేషన్ పరిసరాలు, సర్టిఫికెట్లను అడిగి తెలుసుకున్నారు.లాకప్, ఎస్.హెచ్.ఓ రూమ్ పరిశీలించారు.

ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలు తీర్చాలని ప్రజా ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తూ బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి,బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని, సామాన్యుడు పోలీస్ స్టేషన్ కు వస్తే తగు న్యాయం జరుగుతుందని నమ్మకం కలిగేలా పని చేయాలని,అప్పుడే ప్రజల్లో పోలీసులపై నమ్మకం వస్తుందన్నారు.

అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్ పనులని పరిశీలించి,నాణ్యతతో త్వరగా ముగించాలని సూచించారు.అనంతరం మండల ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

ప్రజలకు చేరువయ్యేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని,జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ సందర్శిస్తానన్నారు.స్వీకరించిన దరఖాస్తుల సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ డిఎస్పి గిరిబాబు, నాంపల్లి సిఐ నవీన్ కుమార్,చింతపల్లి ఎస్సై యాదయ్య,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube