వైరల్ వీడియో: స్కాం కాలర్ కి వణుకు పుట్టించిన యువకుడు..

ప్రస్తుతం ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మంచి ఎలా జరుగుతుందో.మరోవైపు.

, చెడు కూడా అలాగే జరుగుతూ ఉంది.టెక్నాలజీని ఉపయోగించి డబ్బులు సంపాదించే విధాలు చాలానే ఉన్నాయి.

అయితే, కొందరు మాత్రం ఇదే టెక్నాలజీని అడ్డం పెట్టుకుని వేరే వారి సొమ్ముని నిలువునా దోచేస్తున్నారు.అలాంటివారినే స్కామర్స్ అంటారు.

ఇలాంటివారు మీరు ఈ లింకు పై క్లిక్ చేస్తే చాలు.ఇంత డబ్బు మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది అంటూ మెసేజ్లు చేస్తూ లేకపోతే మరో విధంగా ఏదో ఒక విషయంపై భయపెడుతూ డబ్బులను కాజేయాలని చూస్తూ ఉంటారు.

Advertisement

తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.ఓ వ్యక్తి స్కామర్(Scam Callers) తో మాట్లాడుతున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

వైరల్ గా మారిన వీడియోలో ఓ యూజర్ మాత్రం స్కామర్ కు చుక్కలు చూపించాడు.ప్రస్తుతం జరుగుతున్న కొత్త రకం స్కామ్ లో భాగంగా.

స్కామర్ సదరు వ్యక్తికి ఫోన్(phone) చేసి మీ అకౌంట్ లో 8,999 జమా అవుతాయని చెప్పి ఓ లింక్ పంపించి అది క్లిక్ చేయమని చెప్పాడు.అయితే ఇలాంటి బంపర్ ఆఫర్లను పోగొట్టుకోలేక చాలామంది ఆ లింకులను క్లిక్ చేసి వారు చెప్పింది చేసేయడం పరిపాటిగా మారిపోవడంతో అనేకమంది మోసాలకు గురవుతున్నారు.

అయితే వీడియో రికార్డు చేసిన యూజర్ మాత్రం ఫోన్ కాల్ లో మాట్లాడుతూ ఉండగానే మరో ఫోన్ తో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ వీడియోలో స్కామర్ యూపీఐపీ(UPI) సహా అన్ని వివరాలను అడగ్గా మొదట యూజర్ కి స్కామర్ సార్ అని రెస్పెక్ట్ ఇస్తుండగా చివర్లో మాత్రం.

వీడియో: ప్రత్యర్థిపై విషప్రయోగం చేసిన రష్యన్ ఫిమేల్ చెస్ ప్లేయర్..!
పోలీస్ స్టేషన్‌లోనే మహిళపై దాడి చేసిన బీజేపీ నేత.. దుమారం రేపుతున్న వీడియో..

అతడు ఎంత డేంజరో తెలియజేసాడు.

Advertisement

వీడియోలో చూసినదాని ప్రకారం 8999 రూపాయలు సంబంధించి లింక్ క్రియేట్ చేసి దానికి యూపీఐ పిన్(UPI PIN) ఎంటర్ చేయాలి.అప్పుడే, మీకు మీ అకౌంట్లో డబ్బులు పడతాయని స్కామర్ మోసం చేయడానికి ప్రయత్నించాడు.అయితే సదరు వ్యక్తి మాత్రం ఆ స్కామర్ ఫోన్ నెంబర్ వాయిస్ ను రికార్డ్ చేస్తూ ఓ వీడియో చేశాడు.

అందులో నేను ఈ యూపీఐ పిన్ కొడితే డబ్బులు నీకు రావని చెప్పడంతో అసలు గొడవ మొదలైంది.దీంతో చివర్లో కోపం తెచ్చుకున్న స్కామర్ నీలాంటి వారిని నేను రోజు లక్షలాదిమందిని చూస్తాను అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు.

అంతేకాదు యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేస్తా అని బెదిరించడంతో.ఒకవేళ నువ్వు ఈ వీడియోని పోస్ట్ చేసినట్లయితే నీ ఫోన్ ని హ్యాక్ చేస్తా అంటూ బెదిరించడం కూడా చూడవచ్చు.

కాబట్టి ఇలాంటి దారుణాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండడం చాలా అవసరం.

తాజా వార్తలు