కరోనా తెచ్చిన తంటా..హత్యారోపణతో భారతీయుడు అరెస్ట్..!!

ఎంత పనిచేశావే కరోనా అంటే ఈ మధ్య కాలంలో ఓ కరోనాపై ఓ సాంగ్ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

ఈ పాటకి తగ్గట్టుగానే ఉంది సౌదీ లోని ఓ భారతీయుడు పరిస్థితి.

కరోనా ఎంత పనిచేశావే అంటూ ఇప్పుడు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నాడు.నేను కావాలని ఈ పనిచేయలేదు ప్లీజ్ వదిలేయండి అంటూ సౌదీ పోలీసులని బ్రతిమిలాడుకుంటున్నాడు.

ఇంతకీ కరోనా ఇతడిని ఎలా బుక్ చేసింది.అసలేం జరిగింది అనే వివరాలలోకి వెళ్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు.

ప్రపంచాన్ని కంగారు పెట్టిస్తున్న కరోనా సౌదీ ని కూడా ఓ ఊపు ఊపేస్తోంది.ఇప్పటి వరకూ సౌదీలో సుమారు 2,900 మందికి కరోనా సోకగా 41 మంది మృతి చెందారు.

Advertisement

దాంతో సౌదీ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.అసలే సౌదీ రూల్స్ కరోనా నేపధ్యంలో వీటిని మరీ ఎక్కువగా పెంచేశారు దాంతో బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేస్తే కటినమైన శిక్షలు విదిస్తాయని ప్రకటించారు.ఈ క్రమంలోనే

సౌదీ లో వరంగల్ జిల్లాకి చెందిన ఓ యువకుడు అక్కడి సూపర్ మార్కెట్ కి వెళ్ళాడు.అతడి ఖర్మ కాలి ఒక్క సారిగా తుమ్మాడు, అక్కడితే ఆగకుండా చేతితో సామాన్లు ముట్టుకున్నాడు.ఇది చూసిన బాలిక పరుగు పరుగున స్టోర్ వాళ్లకి కాల్ చేసి పోలీసులని పిలిపించింది.

అతడిని విచారణా చేసిన పోలీసులు అరెస్ట్ చేసి అతడి సాంపిల్స్ టెస్ట్ కి పంపగా కరోనా పాజిటివ్ అని తేలింది దాంతో అతడిపై హత్య నేరం కింద కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు.కరోనా ఉందని తెలిస్తే హాస్పటల్ కి వెళ్ళే వాడినని, పొరబాటున జరిగిన పని కాబట్టి వదిలేయమని ఎంత వేడుకున్నా అస్సలు కనికరించలేదని బోరుమంటున్నాడు.

వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్
Advertisement

తాజా వార్తలు