సౌదీ అరేబియా షాకింగ్ డెసిషన్..ఆందోళనలో భారత ఎన్నారైలు...

అరబ్బు దేశమైన సౌదీ అరేబియా విజిట్ వీసాల రెన్యువల్ విషయంలో తాజాగా తీసుకున్న నిర్ణయం ఎంతో మందిప్రవాస భారతీయులపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.

తమ దేశంలో పెరిగిపోతున్న వలస జనాభాను నియంత్రించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇంతకీ సౌదీ ప్రవాసుల విజిట్ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం ఏంటి, భారతీయులకు ఇది ఏ విధంగా నష్టం తీసుకురానుంది అనే వివరాలలోకి వెళ్తే.సౌదీకి ఉద్యోగాల నిమిత్తం, కార్మికులుగా ఎంతో మంది వలసలు వెళ్తూ ఉంటారు.

అలా వలసలు వెళ్లి వారు తమతో వారి కుటుంభ సభ్యులను కూడా తీసుకువెళ్తారు.అయితే కుటుంభ సభ్యులను కూడా తమతో తీసుకుని వెళ్ళాలంటే తప్పనిసరిగా వారిని విజిట్ వీసాపైనే తీసుకుని వెళ్ళాలి.

ఈ వీసాలను మూడు నెలలకు ఒక సారి రెన్యువల్ చేసుకుని అక్కడే తమతో పాటు కుటుంభ సభ్యులను ఉంచుకోవచ్చు.దాంతో ఎంతో మంది ప్రవాస భారతీయులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కుటుంభ సభ్యులతో ఉంటున్నారు.

Advertisement

ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే వారు ఈ సౌకర్యాన్ని పొందుతున్నారు.అయితే

ఈ పరిస్థితిని గమనించిన సౌదీ ప్రభుత్వం ఇక్కడే విజిట్ వీసాలపై ఉంటున్న వారికి బిగ్ షాక్ ఇచ్చింది.వారం రోజులుగా ఈ విజిట్ వీసాల రెన్యువల్స్ సేవలను నిలిపివేసింది సౌదీ ప్రభుత్వం.గతంలో ఈ వీసా రెన్యువల్ గడువు ఏడాది వరకూ ఉండేది కానీ తాజాగా ఈ గడువును 3 నెలలకు కుదించడమే కాకుండా ఉన్నట్టుండి రెన్యువల్స్ ను నిలిపివేయడంతో ఏం చేయాలో దిక్కుతోచక వేలాది మంది భారతీయ ఎన్నారై కుటుంభాలు వెనక్కి వచ్చేస్తున్నాయి.

సొంత గ్రామాలలో పనులు వదులుకుని, ఇళ్ళను అమ్మేసుకుని, లేదా అద్దెలకు ఇచ్చుకుని, సర్వం సౌదీలోనే అనుకుని వెళ్ళిన ఎన్నో కుటుంభాలు నేడు సౌదీ నిర్ణయంతో షాక్ కి గురయ్యాయి.ఇదిలాఉంటే తాజాగా మారిన నిభంధనల ప్రకారం ఫ్యామిలీ వీసా కంటే కూడా ఇప్పుడు విజిట్ వీసాల ఖర్చు తడిచి మోపెడు అవుతోందట.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..
Advertisement

తాజా వార్తలు