నేను ఓ స్థాయిలో ఉన్నప్పుడే వాళ్ళు సినిమాల్లోకి వచ్చారు

విలక్షణ విలన్ గా మంచి పేరు సంపాదించుకున్న నటుడు ఎవరు అంటే సత్యప్రకాశ్ అనే చెప్పాలి.

ఆయన పుట్టి పెరిగింది కర్నాటకలో, కన్నడ సినిమాలో కంటే తెలుగు సినిమాల్లోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలను గుర్తుచేసుకున్నాడు.ముఖ్యంగా రవితేజ,ప్రకాష్ రాజ్ ల గురుంచి కొన్ని ఆసక్తి కర విషయాలు చెప్పాడు.

వారిద్దరి కంటే ముందే నేను సినిమాల్లోకి అడుగుపెట్టాను.నేను మంచి స్థాయిలో ఉన్నప్పుడే రవి తేజ, ప్రకాష్ రాజ్ లు కెరీర్ ప్రారంభించారు.

రవి నాతో ఎక్కువ చనువుగా ఉండేవాడు.అప్పుడే సినిమాల్లోకి రావడంతో ప్రతీదీ నాతో షేర్ చేసుకునేవాడు.

Advertisement

ఇద్దరం ఒకే బైక్ పైన తిరిగేవాళ్ళం.ఆ తరువాత రవి సినిమాల్లో బాగా కష్టపడి మంచి స్థాయిలో ఉన్నాడు.

ప్రకాష్ రాజ్ కూడా అంతే నా తరువాత విలన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఆ తరువాత నన్ను దాటేసి వెళ్ళిపోయాడు.

ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏ విధమైన పాత్రలను అయిన అలవోకగా చెయ్యగలడు.ఇప్పుడు వారిద్దరూ నాతో టచ్ లో లేరు.

వాళ్ళు వాళ్ల పర్సనల్ లైఫ్ మరియు కెరీర్ తో బిజీగా ఉన్నారు.ఇప్పుడు నాతో ఉన్నవారు నేను సినిమా మొదలు పెట్టినప్పుడు, నా స్థాయి కి వచ్చిన వారితో మాత్రమే నేను స్నేహం చేస్తున్నాను అన్నారు.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు