ఇల్లు కూలిపోయిన బాధితురాలికి టార్ఫాలిన్ ఇస్తానని సర్పంచ్ హామీ

సర్పంచ్ ఆదేశాలతో బాధిత కుటుంబానికి టార్ఫాలిన్( Tarphalin ) అందించిన ఉపసర్పంచ్ఆపదలో ఆదుకుంటున్న సర్పంచ్ అంటూ పలువురు ప్రశంసలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేటలో( Kishan Das Petalo ) గల నూకల ఎల్లవ్వ ఇంటిలో అద్దెకి ఉంటున్న ఒగ్గు నరసవ్వ కుటుంబ సభ్యులు.

గత వారం రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా ఇంటిపై కప్పు కూలి పడగా పెను ప్రమాదం తప్పింది.

వెంటనే స్పందించిన కూలిపోయిన ఇంటి వద్దకు వచ్చి పరిస్థితిని పరిశీలించి అధైర్య పడకండి మీకు నేను అండగా ఉన్నానని సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి అన్నారు.మీకు ఇంటి పై కప్పుకోవడానికి టార్ఫాలిన్ పరదాను ఇస్తానని హామీ ఇచ్చారు.

కాగా కూలిపోయిన ఇల్లు ఖాళీ చేసి మరో ఇంటిలో కిరాయికి ఉంటున్న ఒగ్గు నరసవ్వ కుటుంబానికి సర్పంచ్ టార్ఫాలిన్ పరదాను ఇవ్వమని ఆదేశించగా ఈరోజు గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ అద్దెకుంటున్న నర్సవ్వ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.దీంతో ఆ కుటుంబం సర్పంచ్ వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఉప సర్పంచ్ వెంట మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్, నూకల శ్రీనివాస్ యాదవ్, కొర్ర వేణు యాదవ్, సంగ మల్లయ్య, ఏర్పుల హనుమయ్య, బాయికాడి చంద్రం ఉన్నారు.

Advertisement
ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News