సరిపోదా శనివారం టీజర్ రివ్యూ.. యాక్షన్ సీన్స్ లో న్యాచురల్ స్టార్ అదరగొట్టాడుగా!

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని ( Nani )గురించి మనందరికీ తెలిసిందే.నాని ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.అందులో భాగంగానే ఇటీవల హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సరిపోదా శనివారం అనే సినిమాలో( Saripodhaa Sanivaaram ) నటిస్తూ బిజీగా ఉన్నారు నాని.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను పెంచాయి.ఈ సినిమా కోసం నాని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ఇక ఇందులో ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.ఇకపోతే ఈరోజు సూర్య పుట్టినరోజు సందర్భంగా తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.

80 సెక‌న్ల పాటు సాగిన టీజ‌ర్ ఉంది.ఇందులోనే క‌థని, పాత్ర‌ల్ని క్తుప్తంగా ప‌రిచ‌యం చేసేశారు.

శ్రీ‌కృష్ణుడు, స‌త్య‌భామ క‌లిసి న‌ర‌కాసుర వ‌ధ చేసిన వైనం గుర్తు చేస్తూ నాని, ప్రియాంకా మోహ‌న్‌, ఎస్‌.సె.సూర్య పాత్ర‌ల్ని తెర‌పైకి తీసుకొచ్చారు.

సూర్య ఇందులో ఒక క్రూర‌మైన పోలీస్‌ మిత్రులు కనిపించనున్నారు.ఇక త‌న అరాచ‌కాల్ని హీరో ఎలా ఎదిరించాడ‌న్న‌ది ఈ సినిమా కాన్సెప్ట్.ఇందులో సూర్య‌, నాని మ‌ధ్య సాగిన పోరు ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలవనుంది.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

శ‌నివారం అనే కాన్సెప్ట్ కూడా కొత్త‌గా ఉంటుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది.ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన ప్ర‌మోష‌న్ కంటెంట్ ఈ సినిమాపై ఉన్న ఆస‌క్తిని మ‌రింత రెట్టింపు చేసింది.

Advertisement

టీజ‌ర్ చూస్తే యాక్ష‌న్ కు పెద్ద పీట వేసిన‌ట్టు అర్థం అవుతోంది.తాజాగా విడుదలైన టీజర్ ని చూసిన ప్రేక్షకులు ఈసారి కూడా నాని ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ కాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు