వివాహంలో సప్తపది యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

మన భారతీయ వివాహ వ్యవస్థలో సంస్కృతి సంప్రదాయాలు ప్రత్యేకమైన స్థానం ఉంది.వివాహంలో సప్తపది అనేది ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్పాలి.

సప్తపది అంటే ఏడు అడుగులు అని అర్ధం.వివాహంలో హోమం చేసిన గుండానికి ఉత్తరం వైపుగా ఏడు తమలపాకులను పరుస్తారు.

కొత్త జంట ఆ ఆకుల మీదుగా ఉత్తరం వైపు ఏడు అడుగులు నడవడాన్ని సప్తపది అని అంటారు.ఈ సప్తపది కార్యక్రమం జరిగిన తర్వాత వధువు ఇంటి పేరు,గోత్రం మారిపోతుంది.

వేదాలలో ఈ ఏడు అడుగులలో ఒక్కో అడుగుకు ఒక్కో అర్ధం చెప్పబడింది.మొదటి అడుగు శారీరక బలం కోసం,రెండో అడుగు మానసిక బలం కోసం,మూడో అడుగు ధర్మం కోసం,నాల్గో అడుగు కర్మ సంబంధ సుఖం కోసం,ఐదో అడుగు పశు సమృద్ధి కోసం,ఆరో అడుగు ఆరోగ్యం కోసం,ఏడో అడుగు సంసారంలో సఖ్యత కోసం ఇలా ఏడు అడుగులు వేయిస్తారు.

Advertisement
నోటి చుట్టూ ముడ‌త‌ల‌కు కార‌ణాలు, నివార‌ణ మార్గాలు మీకోసం!

తాజా వార్తలు