వర్షం సినిమా తో పాటు పలు సినిమా లను తెరకెక్కించిన దర్శకుడు శోభన్. ఆయన తనయుడు సంతోష్ శోభన్ హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
శోభన్ మృతి తర్వాత హీరోగా పరిచయం అయిన సంతోష్ శోభన్ సక్సెస్ కాలేక పోయాడు.ఇప్పటికే విడుదల అయిన సినిమా లు నిరాశ పర్చడంతో తాజాగా ఏక్ మినీ కథ అనే విభిన్నమైన సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏక్ మినీ కథ కోసం ఇప్పటికే ప్రభాస్ మరియు రామ్ చరణ్ లు మద్దతుగా నిలిచారు.తనకు వర్షం వంటి సూపర్ హిట్ ను ఇచ్చిన శోభన్ తనయుడు సంతోష్ కు మంచి సక్సెస్ దక్కాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్ ముందుకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ట్రైలర్ ను విడుదల చేయించడం జరిగింది.
ట్రైలర్ విడుదల తర్వాత సినిమా కు మంచి బజ్ వచ్చింది.సినిమా విడుదల సమయంలో రామ్ చరణ్ స్పందించాడు.

సంతోష్ శోభన్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అందరికి కూడా శుభాకాంక్షలు అంటూ రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా ఏక్ మినీ కథకు ఆన్ ది బెస్ట్ చెప్పాడు.మరో వైపు సంతోష్ శోభన్ కు ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నిన్న వచ్చిన ఈ సినిమాను అమెజాన్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.ఫుల్ కామెడీ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని అంటున్నారు.తాజాగా ఈ సినిమా గురించి మరో స్టార్ హీరో శర్వానంద్ కూడా స్పందించాడు.
శర్వానంద్ సోషల్ మీడియాలో చాలా విభిన్నమైన కథను ఎంపిక చేసుకున్నారు.ఇలాంటి సబ్జెక్ట్ చేసినందుకు మీకు అభినందనలు అంటూ పోస్ట్ చేశాడు.