ఆ జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం.. అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయిగా!

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ( Sankranthiki Vasthunnam Movie ) బాక్సాఫీస్ వద్ద ఆంచనాలకు మించి విజయం సొంతం చేసుకుంది.

సంక్రాంతికి విడుదలైన ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాకు బెటర్ కలెక్షన్లు వచ్చాయి.

వీక్ డేస్ లో కూడా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా అదరగొడుతున్న సంగతి తెలిసిందే.అయితే విజయనగరం జిల్లాలో( Vizianagaram District ) కలెక్షన్ల విషయంలో ఈ సినిమా సంచలనాలు సృష్టించింది.2 కోట్ల 21 లక్షల 36 వేల 978 రూపాయల కలెక్షన్లతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.గతంలో ఏ సినిమాకు సొంతం కాని రికార్డ్ ఈ సినిమాకు సొంతం కావడం సినీ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

జక్కన్న ఆర్.ఆర్.ఆర్( RRR ) ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా పుష్ప2( Pushpa 2 ) మూవీ మూడో స్థానంలో ఉందని సమాచారం అందుతోంది.కల్కి, బాహుబలి2, దేవర సినిమాలు తర్వాత స్థానాలలో ఉన్నాయి.

Sankranthiki Vasthunnam Movie Breaks All The Records Details, Sankranthiki Vasth

అల వైకుంఠపురములో, సలార్, వకీల్ సాబ్, గేమ్ ఛేంజర్ సినిమాలు తర్వాత స్థానాలలో ఉన్నాయి.విజయనగరం టాప్ 10 వసూళ్ల జాబితాలో వెంకీ మామ మూవీ తొలి స్థానంలో నిలవడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.విక్టరీ వెంకటేశ్( Victory Venkatesh ) తర్వాత సినిమాలతో భారీ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Sankranthiki Vasthunnam Movie Breaks All The Records Details, Sankranthiki Vasth
Advertisement
Sankranthiki Vasthunnam Movie Breaks All The Records Details, Sankranthiki Vasth

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.వెంకటేశ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచిందని చెప్పవచ్చు.సంక్రాంతికి వస్తున్నాం సినిమా కథ రొటీన్ అయినా కథనం కొత్తగా ఉండటం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయిందని చెప్పవచ్చు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలోని బుల్లిరాజు పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ రావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు