సంజయ్ పాదయాత్ర ! వారు దూరం .. వీరు దగ్గర

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు.గతంలో బిజెపి లో ఎప్పుడూ చోటు చేసుకోని పరిణామాలు ఈ యాత్రలో కనిపిస్తున్నాయి.

ఆగస్టు 28 మొదలైన ఈ పాదయాత్ర పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.ముఖ్యంగా బిజెపి అధిష్టానం ఈ పాదయాత్ర కు వస్తున్నా రెస్పాన్స్ విషయమై ఆరా తీస్తోంది.

సంజయ్ పాదయాత్రకు వచ్చిన రెస్పాన్స్ ద్వారా తెలంగాణలో తమ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే అంచనా లో బిజెపి ఉంది.ఇదిలా ఉంటే సంజయ్ పాదయాత్రలో సీనియర్ నాయకుల కంటే జూనియర్ నాయకుల హడావుడి ఎక్కువగా కనిపిస్తోందట.

        అంతేకాదు సంజయ్ పాదయాత్ర ఖర్చు కోసం అధిష్టానాన్ని  అభ్యర్ధించాల్సిన అవసరం లేకుండా, యువ నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో ఆ ఖర్చును భరిస్తూ ఉండటం చర్చనీయాంశం గా మారింది.ఖర్చుతో పాటు జనసమీకరణ వంటి వ్యవహారాల పైన యువ నాయకులు దృష్టి పెట్టడం,  సంజయ్ పాదయాత్రకు రెస్పాన్స్ బాగా వచ్చే విధంగా అన్ని వారే చక్కబెడుతూ ఉండడం,  ఇవన్నీ కొత్తగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.

Advertisement

గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు.సీనియర్ నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చూసేవారు.

నిధుల విషయంలో అధిష్టానం సాయం కోసమే ఎదురు చూసే వారు .ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.,/br>   

  కొత్తగా యువ నాయకులు ఎక్కువ అవ్వడం రాబోయే ఎన్నికల్లో టికెట్లు తమకు దక్కుతాయని నమ్మకంతో పాదయాత్ర కు సంబంధించి అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నారు.దీనికితోడు సంజయ్ కూడా సీనియర్ నాయకుల కంటే యువ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉండడం, రాబోయే ఎన్నికల్లోనూ వారికే ఎక్కువగా టికెట్లు కేటాయించాలనే ఆలోచనతో ఉండడం తదితర కారణాలతో సీనియర్ నాయకులు సంజయ్ పాదయాత్ర లో కనిపించడం లేదట.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు