తెలుగులో “తకిట తకిట” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచమయిన యువ హీరో “హర్షవర్ధన్ రాణే” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు హర్షవర్ధన్ రాణే వచ్చింది రావడంతోనే తన నటనతో ఆకట్టుకోవడంతో సినిమా అవకాశాలు బాగానే వరించాయి.
దీంతో హర్షవర్ధన్ రాణే తెలుగులోనే కాకుండా హిందీలో కూడా పలు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి బాగానే ఆకట్టుకున్నాడు.ఈ క్రమంలో కేవలం హీరోగా మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ మరియు విలన్ పాత్రలో కూడా నటించి బాగానే అలరించాడు.
కానీ క్రమక్రమంగా హర్షవర్ధన్ టాలీవుడ్ పై కాకుండా బాలీవుడ్ పై దృష్టి పెట్టడంతో తెలుగులో అవకాశాలను దక్కించుకోలేక పోతున్నాడు.
తాజాగా ఓ ప్రముఖ ఇంగ్లీషు చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ రానే పాల్గొని తాను సినిమాల్లోకి ఎలా వచ్చాడనే విషయంపై స్పందించాడు.
ఇందులో భాగంగా తాను సినిమాల్లోకి రాక ముందు ఓ ప్రముఖ బైక్ షోరూం సంస్థలో డెలివరీ బాయ్ గా పని చేసేవాడినని ఆ సమయంలో పార్సిల్ ని ఇవ్వడానికి వెళ్లి బాలీవుడ్ ప్రముఖ హీరో జాన్ అబ్రహం ని కలిశానని తెలిపాడు.సరిగ్గా అదే సమయంలోనే జాన్ అబ్రహం ఓ హిందీ చిత్ర షూటింగులో పాల్గొంటున్నట్లు తనకు తెలియడంతో ఏదైనా అవకాశం దొరుకుతుందేమోనని అడిగాడట.
దీంతో జాన్ అబ్రహం తనకు సూటయ్యే వేషం ఉంటే కచ్చితంగా చెబుతానని చెప్పడంతో అప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడట.ఆ తర్వాత సడన్ గా ఓ రోజు తనకు సినిమాల్లో అవకాశం వచ్చినట్లు ఫోన్ కాల్ రావడంతో ఆశ్చర్యపోయాడట.
ఆ తర్వాత వరుసగా హర్షవర్ధన్ రాణే సినిమా అవకాశాలు దక్కించుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే తెలుగులో హర్షవర్ధన్ రాణే పలు చిత్రాలలో హీరోగా నటించాడు.కానీ ఎక్కువ శాతం చిత్రాలలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటించడంతో నటుడిగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు.కానీ హిందీలో మాత్రం “సనమ్ తేరి కసమ్” చిత్రంతో బాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఫిదా చేశాడు.
కాగా ఇటీవలే హర్షవర్ధన్ రాణే “హసీన దిల్రుబా” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించాడు.ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది.
కాగా ప్రస్తుతం తెలుగులో “బృందావనమది అందరిదీ” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.కానీ అనివార్య కారణాల వల్ల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు నిలిచిపోయినట్లు సమాచారం.