గోపీచంద్ తమన్నా హీరో హీరోయిన్లుగా కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం “సిటీ మార్”.ఈ చిత్రం వినాయక చవితి పండుగ సందర్భంగా థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు.తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకొని పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి దర్శకుడు సంపత్ నంది స్పందిస్తూ కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి ఒక్క హిట్ కూడా లేని తనకు సిటీ మార్విజయం సాధించడంతో ఎంతో సంతోషంగా ఉందని ఎమోషన్ అయ్యారు.
ఈ సినిమా విడుదలకు మూడు రోజుల ముందు నుంచి తనలో ఎక్కువ కంగారు మొదలైందని ఇలాంటి కరోనా పరిస్థితులలో సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించాము.సినిమా చూడటానికి జనాలు థియేటర్లకు వస్తారా? అంటూ ఎంతో కంగారు పడ్డారని, ఈ మూడు రోజులు తనకు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదని తెలిపారు.

అయితే సినిమా థియేటర్ లో విడుదలైన తర్వాత మొదటి షో కలెక్షన్లు కాస్త ఆలస్యంగా రాబట్టినప్పటికే తర్వాత షోలు మంచి పాజిటివ్ టాక్ తో, కలెక్షన్ల పరంగా దూసుకుపోవడంతో ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.కబడ్డీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకి కమర్షియల్ అంశాలు జోడించి చెబితే ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకున్నాను.ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది కనుక ఈ సినిమా ప్రేక్షకుల విజయం అంటూ సంపత్ నంది సిటీ మార్ సినిమా గురించి మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు.