పదేళ్లుగా ఈ రేంజ్ హిట్ రాలేదు.. సంపత్ నంది ఎమోషనల్?

గోపీచంద్ తమన్నా హీరో హీరోయిన్లుగా కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం "సిటీ మార్".

ఈ చిత్రం వినాయక చవితి పండుగ సందర్భంగా థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు.

తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకొని పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి దర్శకుడు సంపత్ నంది స్పందిస్తూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి ఒక్క హిట్ కూడా లేని తనకు సిటీ మార్విజయం సాధించడంతో ఎంతో సంతోషంగా ఉందని ఎమోషన్ అయ్యారు.

ఈ సినిమా విడుదలకు మూడు రోజుల ముందు నుంచి తనలో ఎక్కువ కంగారు మొదలైందని ఇలాంటి కరోనా పరిస్థితులలో సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించాము.

సినిమా చూడటానికి జనాలు థియేటర్లకు వస్తారా? అంటూ ఎంతో కంగారు పడ్డారని, ఈ మూడు రోజులు తనకు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదని తెలిపారు.

"""/"/ అయితే సినిమా థియేటర్ లో విడుదలైన తర్వాత మొదటి షో కలెక్షన్లు కాస్త ఆలస్యంగా రాబట్టినప్పటికే తర్వాత షోలు మంచి పాజిటివ్ టాక్ తో, కలెక్షన్ల పరంగా దూసుకుపోవడంతో ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

కబడ్డీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకి కమర్షియల్ అంశాలు జోడించి చెబితే ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకున్నాను.

ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది కనుక ఈ సినిమా ప్రేక్షకుల విజయం అంటూ సంపత్ నంది సిటీ మార్ సినిమా గురించి మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!