ఇత‌ను మ‌నిషేనా.. సాంబార్ రుచిగా లేద‌ని త‌ల్లిని, చెల్లిని..

ఈ మ‌ధ్య జ‌రుగుతున్న దారుణాలు చూస్తుంటే అస‌లు వీరు మ‌నుషులేనా అనిపించ‌క‌మాన‌దేమో.ఎందుకంటే జంతువుల కంటే దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వావి వ‌ర‌స‌లు మ‌రిచిపోయి మాన‌వ‌త్వాన్ని బొంద‌పెట్టి అరాచ‌కాలు సృష్టిస్తున్నారు.కొన్ని సార్లు వారు చేసే అరాచ‌కాల‌కు సంబంధించిన కార‌ణాలు వింటేనే ఆశ్చ‌ర్యం వేస్తుంది.

ఈ మాత్రం దానికి ఇంత దారుణానికి ఒడిగ‌ట్టాలా అనిపిస్తుంది.కానీ క్ష‌ణికావేశంలో వారు చేసే ప‌నులు అలా ఉంటున్నాయి.

ఇప్పుడు కూడా ఓ ప్ర‌బుద్ధుడు చేసిన ప‌ని అంద‌రినీ షాక్ కు గురి చేస్తోంది.కేవ‌లం సాంబార్ రుచిక‌రంగా వండలేద‌ని ఓ క్రూరుడు ఏకంగా క‌న్న త‌ల్లిని, సొంత చెల్లెలును పొట్ట‌న బెట్టుకున్నాడు.

Advertisement

విన‌డానికే విచిత్రంగా ఉన్నా కూడా ఇదే నిజం.ఇంత చిన్న దానికి అంత పెద్ద నేరం చేశాడు ఇత‌గాడు.

ఈ దారుణ‌మైన ఘ‌ట‌న కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా అయిన‌టువంటి సిద్ధాపురంలో జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.ఈ జిల్లాలోని కడుగోడు గ్రామంలో నివ‌సిస్తున్న మంజునాథ ఎప్ప‌టి నుంచో మద్యానికి బానిసగా మారి ఇంట్లో వారిని ఇబ్బంది పెడుతున్నాడు.

నిత్యం మ‌ద్యం తాగుతూనే ఉంటాడు.ఇకో రోజు తాగిన త‌ర్వాత ఇంట్లో సాంబార్ భోజ‌నం తింటున్నాడు.

కాగా అది కాస్తా కొంచెం బాగోక‌పోయే స‌రికి ఎందుకిలా తయారు చేశారంటూ త‌ల్లి పార్వతిని అలాగే చెల్లెలు రమ్యను అడిగాడు.ఆరు ఏదో స‌మాధానం చెప్పినా వినిపించుకోకుండా ఇద్ద‌రిపై తీవ్రంగా ఆగ్ర‌హానికి గుర‌య్యాడు.క్ష‌ణికావేశంలో తన వ‌ద్ద ఉన్న‌టువంటి పిస్టల్ తో ఇద్ద‌రిని కాల్చి చంపేశాడు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 

త‌ల్లి, చెల్లెలు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు వ‌దిలారు.స‌మాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు.

Advertisement

ఈ వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెను సంచ‌ల‌నం రేపుతోంది.నిందితుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇంత చిన్న దానికి రెండు ప్రాణాల‌ను బ‌లి తీసుకోవ‌డం ఏంటంటూ మండిప‌డుతున్నారు.

తాజా వార్తలు