అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది.100 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలులోకి రావడంతో పాటు ఏపీలో నాలుగు షోలకు అనుమతులు ఉండటంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు భారీ వసూళ్లు దక్కాయి.అక్కినేని హీరో అఖిల్ కు ఈ సినిమాతో తొలి హిట్ ఖాతాలో చేరిందనే చెప్పాలి.
నైజాం ఏరియాలో ఈ సినిమాకు కోటీ 76 లక్షల రూపాయలు, సీడెడ్ లో కోటీ 10 లక్షల రూపాయలు, ఉభయగోదావరి జిల్లాల్లో 58 లక్షల రూపాయలు, వైజాగ్ లో 56 లక్షల రూపాయలు, గుంటూరులో 50 లక్షల రూపాయలు, అమెరికాలో 2,35,000 డాలర్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం.
తొలి వీకెండ్ లోనే ఈ సినిమా కనీసం 12 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు కనిపిస్తుండటం గమనార్హం.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీగా కలెక్షన్లను సాధించిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఒకటని చెప్పవచ్చు.గీతాఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమా ఏ సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించగా ప్రదీప్ శర్మ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందించడం గమనార్హం.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ ఖాతాలో వేసుకున్న అఖిల్ తర్వాత సినిమాలు కూడా హిట్టయ్యేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.ఈరోజు, రేపు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశాజనకంగా ఉండటం గమనార్హం.ఈ సినిమాతో అఖిల్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందేమో చూడాల్సి ఉంది. అఖిల్ తర్వాత సినిమా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ పేరుతో తెరకెక్కుతోంది.