'శాకుంతలం' అప్‌ డేట్‌.. సమంత ఫుల్‌ హ్యాపీ

టాలీవుడ్‌ లో గుణ శేఖర్‌ కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.

ఆయన కెరీర్లో ఉన్న సినిమా లు చేసిన సినిమా లు కొన్నే అయినా కూడా ప్రతి ఒక్క సినిమా కూడా చాలా ప్రత్యేకమైన సినిమా అనడంలో సందేహం లేదు.

అందుకే ఆయన దర్శకత్వంలో ఇప్పటికి కూడా పెద్ద హీరోలు నటించేందుకు సిద్దంగా ఉన్నారు.గడచిన పదేళ్ల కాలంలో ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సినిమాలు ఎన్ని అంటే రెండు మూడు అంటూ లెక్కలు వినిపిస్తాయి.

ఆరు సంవత్సరాల క్రితం రుద్రమ దేవి సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఆయన మళ్లీ ఇప్పటి వరకు కొత్త సినిమా ను తీసుకు రాలేదు.ఇటీవలే సమంతతో శాకుంతలం సినిమాను మొదలు పెట్టాడు.

సెకండ్‌ వేవ్‌ కు ముందు శాకుంతలం సినిమా దాదాపుగా సగం పూర్తి అయ్యిందని సమాచారం.సెకండ్‌ వేవ్‌ ప్రభావం తగ్గిన వెంటనే గుణశేఖర్‌ శాకుంతలం సినిమాను పట్టాలెక్కించాడు.

Advertisement

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్‌ వరకు ఈ సినిమా షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టేస్తారట.ప్రస్తుతం షూటింగ్‌ జరుపుతున్న యూనిట్‌ సభ్యులు తాజా షెడ్యూల్‌ కు ముగింపు చెప్పి కొన్ని రోజులు బ్రేక్‌ తీసుకుని వెంటనే కొత్త షెడ్యూల్‌ చివరి షెడ్యూల్‌ ను మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

సమంత శాకుంతలం సినిమా మేకింగ్ విషయంలో చాలా సంతోషంగా ఉందట.సమంత నటన ప్రతిభ ను ఈ సినిమాలో చూపించే అవకాశం రావడంతో పాటు తనను అత్యంత అందంగా చూపిస్తున్నారు అంటూ ఆమె మురిసి పోతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న శాకుంతలం సినిమా లో సమంత నుండి వచ్చే లుక్‌ కోసం ప్రతి ఒక్కరు వెయిట్‌ చేస్తున్నారు.

అతి త్వరలోనే శాకుంతలం లుక్‌ వస్తుందని ఆశిద్దాం.సినిమా మాత్రం వచ్చే ఏడాది ఆరంభం లో వస్తుందని అంటున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు