జీవితంలో మొదటిసారంటున్న సమంత

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న సమంత, తాజాగా సొంత భాష తమిళంలో కూడా తన సత్తా చాటుతోంది.

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ కంటే కోలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెడుతున్న ఈ అమ్మడు ప్రస్తుతం విక్రం సరసన ‘10 ఎన్రాదుకుళ్ల’ అనే సినిమాలో నటిస్తుంది.

ఆ సినిమా కోసం సమంత గతంలో ఎప్పుడు లేని విధంగా కష్టపడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.కెరీర్‌ ప్రారంభించిన ఇన్నాళ్లకు కష్టం అంటే ఏంటో ఈ సినిమా ద్వారా ఈ అమ్మడికి అర్థం అవుతున్నట్లుగా తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు.

విక్రం సినిమాలు అంటేనే వైవిధ్యానికి మరోపేరు.విక్రం గతంలో చేసిన ఎన్నో సినిమాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి.

తాజాగా ఆయన చేస్తున్న ఈ ‘10 ఎన్రాదుకుళ్ల’ సినిమా కూడా అలాంటి కోవకు చెందిందే అంటున్నారు.ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

Advertisement

కొంత డిఫరెంట్‌గా కూడా హీరోయిన్‌ పాత్ర ఉంటుంది.అందుకే హీరోయిన్‌గా నటిస్తున్న సమంత చాలా కష్ట పడుతున్నట్లుగా చెబుతోంది.

తాజాగా ఈ అమ్మడు తాను జీవితంలో మొదటిసారి ఇంతగా కష్టపడుతున్నాను అంటూ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసింది.ఈ సినిమాతో తమిళంలో మరో మెట్టును సమంత ఎక్కనుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు