అంతా ఆ దేవుడి దయ అంటున్న టాప్ హీరోయిన్

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని అంటారు పెద్దలు .అలా ఉండటం సమంతకి వాళ్ళ అమ్మ ముద్దతో పెట్టిన విద్య అనుకుంటా .

ఎంత పేరు తెచ్చుకొని, ఎన్ని డబ్బులు సంపాదించినా .అందుకు కారణం ఆ దేవుడే .నాదేమి లేదు అంటూ సింపుల్ గా చెప్పేస్తోంది .‘‘నాకు దేవుడి ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి.నేను ఇవాళ ఇంతెత్తు ఎదిగానంటే అందుకు కారణం దేవుడే.

నన్ను హీరోయిన్‌ని చేసిందీ, ఇవాళ ఈ స్థాయిలో ఉంచుతోందీ ఆయనే.నాకు ఎంతో మంది అభిమానులను ఇచ్చాడు.

సాధారణ మధ్య తరగతి నుంచి వచ్చాను.చిన్నప్పుడు చాలా మందిలాగానే ఎన్నో ఇబ్బందులు పడ్డాను.

Advertisement

అందుకే నాకు కష్టసుఖాల విలువ తెలుసు.కాస్త ఊహ తెలిసినప్పటి నుంచి నాకు సామాజిక సేవ అంటే ఇష్టం.

ఈ అలవాటు నాకు మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది " అంటూ చెప్పుకొచ్చింది సామ్ .ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టే .దక్షిణ భారతంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది, అంత మంది అభిమానుల్ని సంపాదించుకుంది.

Advertisement

తాజా వార్తలు