అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రష్మిక మందన్నా హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా పుష్ప.ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది.
ఐటెం సాంగ్ చిత్రీకరణ తో సినిమా కు గుమ్మడి కాయ కొట్టబోతున్నట్లుగా ప్రకటించారు.భారీ ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమా చిత్రీకరణ మొదలు అయినప్పటి నుండి కూడా అంచనాలు భారీగా పెరిగాయి.
తాజాగా సమంత ఐటెం సాంగ్ అనగానే అంచనాలు పీక్స్ కు చేరాయి.ఇక ఈ సినిమా లో సమంత ఐటెం సాంగ్ మరో లెవల్ లో ఉండబోతుంది అన్నట్లుగా అంతా నమ్మకంగా ఉన్నారు.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకోబోతున్న ఈ సినిమా లో బన్నీ లుక్ ఇప్పటికే అందరిని ఆకట్టుకుంది.ఇక రష్మిక మందన్న మాస్ లుక్ మరియు అందాల ఆరబోత అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.

ఇక సుకుమార్ ఐటెం సాంగ్ అంటే ఖచ్చితంగా హీరోయిన్ అందాల ఆరబోత మరో లెవల్ లో ఉంటుంది.అలాంటి అందాల ఆరబోతనే పుష్ప ఐటెం లో కూడా ఉంటుందని అంటున్నారు.సమంత ఇటీవల భర్త చైతూ నుండి విడిపోయింది.ఆ తర్వాత వస్తున్న మొదటి సినిమా అవ్వడం వల్ల ఆమె అభిమానులు ప్రత్యేకంగా చూస్తున్నారు.పుష్ప సినిమా లో ఆమె అందాల ఆరబోత మరో లెవల్ లో ఉంటుంది అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత లుక్ చాలా నార్మల్ గా ఉంటుందట… అది కాకుండా అందాల ఆరబోత ఏమాత్రం ఉండదని అంటున్నారు.
సమంత అభిమానులకు ఈ ఐటెం సాంగ్ నిరాశ మిగుల్చుతుందేమో అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.వచ్చే నెలలో విడుదల కాబోతున్న పుష్ప సినిమా లో సమంత ఐటెం ఎలా ఉంటుందో చూడాలి.