ఒక సినిమాకు అదే ప్రాణం.. హనుమాన్ సినిమా పై సమంత రివ్యూ?

సంక్రాంతి పండుగ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ( Prashanth Varma ) దర్శకత్వంలో తేజ( Teja ) హీరోగా నటించినటువంటి హనుమాన్ ( Hanuman ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాకు పలువురు స్టార్ సెలబ్రిటీలు మద్దతు తెలియజేస్తూ సినిమాను ప్రమోట్ చేశారు.

ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైనటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా స్టార్ హీరోల సినిమాలను కూడా వెనక్కి నెట్టి మరి సంచలనమైనటువంటి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాకు టాలీవుడ్ నటి సమంత ( Samantha ) కూడా సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సినిమాని ప్రమోట్ చేసారు.ఇక తాజాగా ఈ సినిమాని చూసినటువంటి ఈమె ఈ సినిమాకు తన రివ్యూ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.మనల్ని మళ్లీ బాల్యంలోకి తీసుకువెళ్లగలిగే చిత్రాలు ఎంతో ఉత్తమమైనవి హనుమాన్ సినిమా విజువల్స్, మ్యాజిక్ కామెడీ మ్యూజిక్ అన్ని ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

థాంక్యూ ప్రశాంత్ వర్మ నీ యూనివర్స్ నుంచి మళ్లీ రాబోయే సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.

Advertisement

తేజ సజ్జ నీ నటనతో నన్ను ఆశ్చర్యపోయేలా చేసావు నీ కామిక్ టైమింగ్ నీ నటన అమాయకత్వం హనుమంతుడిగా నువ్వు చేసిన యాక్టింగ్ ఈ సినిమాకి ప్రాణంగా నిలిచింది.ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఎంతో అద్భుతంగా నటించారు అంటూ ఈమె చిత్ర బృందంపై అలాగే డైరెక్టర్ పని తీరు గురించి ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.ఇక ఈ సినిమా ఇప్పటికీ ఎంతో విజయవంతంగా థియేటర్లలో ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.

అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం
Advertisement

తాజా వార్తలు