పవన్ కళ్యాణ్ సినిమాకి నిర్మాతగా సమంత..ఎవ్వరూ ఊహించని కాంబినేషన్!

సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత( Samantha ) కచ్చితంగా నెంబర్ 1 స్పాట్ లో ఉంటుంది.

ఎంత మంది కుర్ర హీరోయిన్స్ వచ్చి పోయినా, సమంత స్థానం ని మాత్రం ఎవ్వరూ చేరుకోలేకపోయారు.

అందం తో పాటు అందం, అద్భుతమైన నటన, ఏ పాత్రలో అయినా అలవోకగా పరకాయ ప్రవేశం చేసే తత్త్వం, ఇవన్నీ ఒక హీరోయిన్ లో ఉండడం చాలా అరుదు.ఆ అరుదైన హీరోయిన్స్ లో ఒకరు సమంత.

ఇంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీ కి వచ్చినా కూడా ఇప్పటికీ ఆమె డిమాండ్ తో కొనసాగుతుంది అంటే ఆమె రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ కి సమంత పెట్టింది పేరు లాగ మారిపోయింది.

ఈమె చేసే ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకి ఉన్నంత మార్కెట్ ఉంటుంది.

Samantha As The Producer Of Pawan Kalyans Movie An Unexpected Combination , Sa
Advertisement
Samantha As The Producer Of Pawan Kalyan's Movie An Unexpected Combination! , Sa

అలా హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయం లో సమంత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు, ఆ ఒత్తిడి కారణంగా ఆమెకు మయోసిటిస్ అనే వ్యాధి సోకడం, చావు చివరి అంచులు దాకా వెళ్లొచ్చి మళ్ళీ సినిమాలు చెయ్యడం ఇవన్నీ మనం చూసాము.ప్రస్తుతం ఆమె డాక్టర్ల సలహా మేరకు సినిమాలకు తాత్కాలిక విరామం ఇచ్చింది.వచ్చే ఏడాది నుండి ఆమె వరుసగా సినిమాలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

అంతే కాదు రీసెంట్ గానే ఆమె ఒక ప్రొడక్షన్ హౌస్ ని కూడా ప్రారంభించింది.ట్రలాల మూవింగ్ పిక్చర్స్( Tralala Moving Pictures)అనే నిర్మాణ సంస్థ ని ప్రారంభించింది.

మండోవా మీడియా వర్క్స్ వర్కింగ్ పార్టనర్ గా వ్యవహిస్తున్నారు.ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఆమె వరుసగా చిన్న సినిమాలను , కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది.

Samantha As The Producer Of Pawan Kalyans Movie An Unexpected Combination , Sa

కేవలం చిన్న సినిమాలను మాత్రమే చేస్తారా?, పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మరియు మహేష్ బాబు లాంటి స్టార్స్ తో సినిమాలు నిర్మించరా అని అడగగా, ప్రస్తుతం అంత పెద్ద వాళ్ళతో సినిమాలు చేయలేము, ముందుగా చిన్నగా ప్రారంభిస్తున్నాము, సక్సెస్ అయితే అంత పెద్ద స్టార్స్ తో సినిమాలు చేసే దానికి మించి అదృష్టం ఏమి ఉంటుంది అని చెప్పుకొచ్చింది.రీసెంట్ గానే ఆమె ఖుషి చిత్రం తో మన ఆడియన్స్ ని పలకరించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా తర్వాత ఆమె అమెజాన్ ప్రైమ్ సంస్థ కోసం చేసిన సిటాడెల్( Citadel ) వెబ్ సిరీస్ అతి త్వరలోనే స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం గా ఉంది.

అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు