సమంత అనారోగ్యం.. తాప్సి సినిమా పరిస్థితి ఏంటి పాపం!

సమంత తీవ్ర అనారోగ్య సమస్యలతో ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.చాలా నెలలుగా ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

కానీ ఆమె అభిమానులు నమ్మలేదు.ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని, కాకపోతే విడాకులు తీసుకున్న తర్వాత కాస్త మానసిక ప్రశాంతత కోసం విదేశాల్లో హాలిడే లో ఉంది అని అంతా భావిస్తున్నారు.

కానీ ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుందని తాజాగా స్వయంగా ఆమె చెప్పడంతో అందరూ నిజమే అనుకుంటున్నారు.సమంత తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమె చేసిన సినిమాల పరిస్థితి ఏంటి అంటూ ఇప్పుడు కొందరు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

తెలుగులో ఇప్పటికే ఈము శాకుంతలం సినిమా ను పూర్తి చేసింది.అంతే కాకుండా యశోద సినిమాని కూడా పూర్తి చేసింది.

Advertisement

రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి.మొదట యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

నవంబర్ రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత పాల్గొనడం అనుమానమే అన్నట్లుగా ఉంది.ఇక గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కనుక ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత పాల్గొనే అవకాశం ఉంది.ఈ రెండు సినిమా లు కాకుండా తాప్సి నిర్మాణం లో హిందీ లో సమంత ఒక సినిమాను చేసేందుకు సంతకం చేసింది.

ఆ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది.ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టాల్సి ఉంది.కానీ సమంత అనారోగ్య కారణాల వల్ల సినిమా షూటింగ్ ఇప్పటి వరకు ప్రారంభించలేదు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

తాప్సి నిర్మాణం చేస్తున్న సినిమా ఇప్పటికే చాలా ఖర్చు చేయడంతో ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాప్సి నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాకి ఇలాంటి సమస్య రావడంతో సమంత అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

వచ్చే సంవత్సరంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందేమో చూడాలి.

తాజా వార్తలు