Salman Khan : సల్మాన్ ఖాన్ కొత్త డైమండ్ రోలెక్స్ వాచ్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లు వాడే వస్తువులు ప్రతి ఒక్కటి కూడా లగ్జరీవి అన్న విషయం మనందరికీ తెలిసిందే.

వారు ధరించే చెప్పుల నుంచి కార్ల వరకు ప్రతి ఒక్కటి కూడా లక్షలు కోట్లు విలువ చేసేవి.

అయితే టాలీవుడ్ నటులతో పోల్చుకుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అన్న విషయం తెలిసిందే.అలా తరచూ ఎవరో ఒకరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు.

తాజాగా కూడా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్( Salman Khan ) ధరించిన వాచ్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వజ్రాలు పొదిగిన రోలెక్స్ వాచ్‌ని ధరించిన సల్మాన్ ఖాన్‌పై కెమెరా కళ్లు పడ్డాయి.అతని వాచ్‌లో కెమెరా జూమ్ చేసి దాని ధర గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి.సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్, భర్త ఆయుష్ శర్మ దీపావళి వేడుకలకు హాజరైన నటుడు స్టైలిష్ బ్లాక్ షర్ట్ ధరించాడు.

Advertisement

నటుడి వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.దాంతో అభిమానులు ఆ వాచ్ ఖరీదు గురించి సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు.అది టైమ్‌పీస్ రోలెక్స్ స్కై డ్వెల్లర్ మెటోరైట్ వాచ్.దాని ధర 2.9 కోట్లు అని తెలియడంతో అభిమానులు నోరెళ్ల బెడుతున్నారు.ఏంటి ఆ వాచ్ ఖరీదు రెండు కోట్ల అని షాక్ అవుతున్నారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇది ఒకటే మాత్రమే కాకుండా సల్మాన్ ఖాన్ వద్ద ఇలా కోట్లు విలువ చేసే వాచ్ లు చాలానే ఉన్నాయి.ఇకపోతే సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే మనీష్ శర్మ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

ఇందులో కత్రినా కైఫ్( Katrina Kaif ) హీరోయిన్ గా నటించింది.ఇటీవల విడుదల అయినా ఈ సినిమా బాక్స్ వద్ద సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?
Advertisement

తాజా వార్తలు