సల్మాన్ ఖాన్ తో చెర్రీ అనుబంధం ఇప్పటిది కాదట.. నెట్టింట్లో వైరల్ వార్త!

మెగా హీరో రామ్ చరణ్ తేజ్ ఇటీవల RRR సినిమా ప్రమోషన్ కోసం ముంబై వెళ్లగా అక్కడ సల్మాన్ ఖాన్ ను కలవడం జరిగింది.

ఈ కార్యక్రమం ప్రీ రిలీజ్ వేడుకకు కూడా సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అదే విధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా సందడి చేశారు.అయితే ఈ సందర్భంగా బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ తో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని అయితే ఆ అనుబంధం ఇప్పటిది కాదని రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ తో ఉన్న తన అనుబంధం గురించి తెలియజేశారు.

సల్మాన్ ఖాన్ గతంలో చిరంజీవితో కలిసి ఒక థమ్సప్ యాడ్ లో పాల్గొన్నారు.అప్పటినుంచి వీరిద్దరికీ మంచి పరిచయం ఏర్పడిందని చెర్రీ ఒక సందర్భంలో తెలియజేశారు.

ఈ యాడ్ తర్వాత తరచూ సల్మాన్ ఖాన్ ను కలవడం వల్ల ఆయనతో మంచి అనుబంధం ఏర్పడింది.అయితే చెర్రీ ముంబై వెళ్లినా, సల్మాన్ హైదరాబాద్ వచ్చినా.

Advertisement

తప్పకుండా కలుస్తామని తెలిపారు.

మెగా కుటుంబంతో సల్మాన్ ఖాన్ కి మంచి అనుబంధం ఉండటం వల్ల ఆయన చిరు సినిమాలో కూడా నటించడానికి సిద్ధమయ్యారని సమాచారం వినబడుతుంది.ఇక వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియడంతో రామ్ చరణ్ సినిమాలో కూడా సల్మాన్ ఖాన్ నటిస్తే ఎంతో బాగుంటుంది అంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు