సలార్ లో ప్రభాస్, శృతి మధ్య రొమాంటిక్ సీన్స్ హైలెట్ అట !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సలార్ కూడా ఒకటి.

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.

శృతి హాసన్ ఈ సినిమాలో జర్నలిస్ట్ గా నటిస్తుంది.ప్రభాస్ తొలిసారి శృతి హాసన్ తో నటిస్తున్నాడు.

Advertisement

అందుకే ఫ్యాన్స్ ఈ జంట తెరమీద ఎలా ఉంటదా అని ఉహించు కుంటున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

ఈ కీలక షెడ్యూల్ లో ప్రభాస్ శృతి హాసన్ పై రొమాంటిక్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలే కాదు రొమాంటిక్ సన్నివేశాలు కూడా పీక్స్ లో ఉంటాయని సమాచారం.

ప్రభాస్, శృతి హాసన్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ తెలిపింది.ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో కీలక తారాగణం మొత్తం షూటింగ్ లో పాల్గొంటునట్టు సమాచారం.

ఈ సినిమాలో సీనియర్ హీరో జగపతిబాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)

ఇది ఇలా ఉంటే ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14 న విడుదల కానుంది.ప్రభాస్ ఈ సినిమాతో పాటు రాధాకృష్ణ డైరెక్షన్ లో రాధే శ్యామ్ సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా, అలాగే నాగ్ అశ్విన్ తో కూడా ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

Advertisement

ఆదిపురుష్ సినిమా కూడా దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.సలార్ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ తిరిగి ఆదిపురుష్ షెడ్యూల్ లో పాల్గొన బోతున్నాడు.

తాజా వార్తలు