ఆర్ ఎక్స్ 100 ఎఫెక్ట్ : అప్పుడే పెళ్లి చేసుకుంటానంటున్న యంగ్ హీరో...

తెలుగులో ఆర్ఎక్స్ 100 వంటి ప్రేమ కథా చిత్రంతో సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే కార్తికేయ వచ్చీరావడంతోనే మంచి హిట్ ని అందుకోవడంతో ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తున్నాడు.

తాజాగా కార్తికేయ టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో కలిసి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.కాగా వచ్చే వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమోని ఇటీవలె షో నిర్వాహకులు యూట్యూబ్ లో విడుదల చేశారు.

అయితే ఇందులో భాగంగా అలీ ఇద్దరితోనూ సరదాగా పంచులు పేలుస్తో ప్రేక్షకులను నవ్వించారు.ఇక కార్తికేయ తాను ఆర్ఎక్స్ 100 చిత్ర కథను విన్నప్పుడు రొమాంటిక్ సీన్లు ఉన్నట్లు దర్శకుడు చెప్పలేదని కానీ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం తప్పలేదని సరదాగా తెలిపాడు.

అలాగే తాను ఒకే సంవత్సరంలో నాలుగు సినిమాలలో నటించానని ఆ తర్వాత కరోనా వైరస్ కలకలం సృష్టించడంతో బాగా గ్యాప్ వచ్చిందని లేకపోతే మరిన్ని చిత్రాల్లో నటించి విడుదల కూడా  చేసేవాడినని చెప్పుకొచ్చాడు.ఇక తన పెళ్లి విషయం గురించి స్పందిస్తూ ఇప్పుడప్పుడే తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అంతేకాకుండా ప్రస్తుతం తన చిత్రాలను చూసినవారు తనకి పిల్లని ఇవ్వరని దాంతో మరో రెండు, మూడు చిత్రాలు తీసిన తర్వాత పెళ్లి చేసుకుంటానని సరదాగా చెప్పుకొచ్చాడు.

Rx100 Movie Fame Karthikeya Clarity About His Marriage, Rx100 Movie, Karthikeya
Advertisement
Rx100 Movie Fame Karthikeya Clarity About His Marriage, Rx100 Movie, Karthikeya

ఆర్ఎక్స్ 100 చిత్రం విడుదలైన ఈ సమయంలో తన తల్లి యూఎస్ లో ఉందని కానీ ఆ చిత్రంలోని రొమాంటిక్ సన్నివేశాలను చూసిన తర్వాత తనతో గొడవ పడిందని తెలిపాడు.ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే తనకీ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్రష్ ఎవరూ లేరంటూ స్పష్టం చేసింది.దీంతో ఆలీ  కనిపించిన హీరోనల్లా అన్నయ్య అంటుంటే ఇంకా క్రష్ ఎలా ఉంటారంటూ సెటైర్ వేస్తూ అందరిని నవ్వించాడు.

అయితే వీరిద్దరి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియాలంటే వచ్చే మంగళవారం వరకు ఆగాల్సిందే.ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే కార్తికేయ చావు కబురు చల్లగా" అనే చిత్రంలో హీరోగా నటించాడు.

కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.దీంతో తన తదుపరి చిత్ర కథల విషయంలో  ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.  కాగా ప్రస్తుతం కార్తికేయ గుమ్మకొండ తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

అలాగే  తమిళ ప్రముఖ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న వాలిమై అనే చిత్రంలో విలన్ గా కూడా నటిస్తున్నాడు.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు