బిగ్ బాస్ నిర్వాహకులు అదే తప్పును రిపీట్ చేస్తున్నారా..?

బుల్లితెర రియాలిటీ షోలలో ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా బిగ్ బాస్ షోకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.

తెలుగులో ఇప్పటివరకు ఈ రియాలిటీ షో స్థాయిలో ఏ షో టీఆర్పీ రేటింగ్ లను సంపాదించుకోలేదు.

బిగ్ బాస్ సీజన్ 4 ముగిసి కొన్ని నెలలే అయినా త్వరగా బిగ్ బాస్ నిర్వాహకులు తెలుగు సీజన్ 5ను స్టార్ట్ చేస్తే బాగుంటుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే సీజన్ 5 ఎప్పటినుండి ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ సీజన్ 5కు హోస్ట్ గా నాగార్జున, నాని పేర్లు వినిపిస్తుండగా ఈ ఇద్దరిలో ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయో తెలియాల్సి ఉంది.అయితే బిగ్ బాస్ సీజన్ 5కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో బిగ్ బాస్ నిర్వాహకులు సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.సామాన్యుల జాబితాలో బిగ్ బాస్ సీజన్ 2లో ముగ్గురు కంటెస్టెంట్లు పాల్గొన్నారు.

Advertisement

అయితే ఆ ముగ్గురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ షోకు ప్లస్ కాకపోగా ఆ షోకు మైనస్ గా మారారు.బిగ్ బాస్ సీజన్ 2 ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడానికి ఈ ముగ్గురు కంటెస్టెంట్లు కూడా కారణమని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.బిగ్ బాస్ సీజన్ 5లో కూడా సీజన్ 2లాగా సామాన్యులకు ఛాన్స్ కల్పిస్తున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 2లో చేసిన తప్పునే మళ్లీ రిపీట్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.అయితే జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరోవైపు ఈ సీజన్ లో కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సోషల్ మీడియా సెలబ్రిటీలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు