1920లో ఆర్ఆర్ఆర్.. అసలు ఏం జరిగింది..?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్‌ను ఉగాది కానుకగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఈ టైటిల్ లోగోలో మనం గమనిస్తే ఒక Rలో చరణ్, ఒక Rలో తారక్, మరో Rలో ఇద్దరి చేతులు కనిపిస్తాయి.

పైన 1920 అని రాసి ఉంటుంది.ఈ సినిమాలో హీరోలు 1920లో ఏం చేశారు.? అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వేర్వేరు ప్రాంతాలకు, నేపథ్యానికి చెందిన పోరాట యోధులు.వారిద్దరు 1920లో ఎలా కలుసుకున్నారు.? ఆ సమయంలో వారిద్దరు కలిసి పోరాటం చేశారా? అది ఎలా సాగింది? అనేది సినిమా కథ అయ్యి ఉండవచ్చు.ఇలా రాజమౌళి సినిమాకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మేనియా ప్రేక్షకులపై పెద్ద స్థాయిలో ఉంది.తాజాగా చరణ్‌ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసిన చిత్ర యూనిట్, తారక్ ఫస్ట్ లుక్‌ను ఎప్పుడు రివీల్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Advertisement
ఇది చూసాక కూడా మ్యాంగో జ్యూస్ తాగితే ఇక అంతే.. వీడియో వైరల్..

తాజా వార్తలు