మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఆయన ట్విట్టర్లోకి అడుగుపెట్టడంతో చాలామంది ప్రముఖులు ఆయనకు స్వాగతం పలికారు.
ఇక ట్విట్టర్లో చేరిన దగ్గర్నుండీ చిరు మామూలు స్పీడు చూపించడం లేదు.ఆయన స్పీడుకు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఇంటికే పరిమితం అయిన చిరు, రోజూ ఏం చేస్తున్నాడని చాలా మంది అనుకుంటున్నారు.దీంతో ఆయన రోజూ ఉదయం లేవగానే ఏం చేస్తాడో తన ట్విట్టర్ అకౌంట్లో తెలిపాడు.
రోజూ ఉదయం మొక్కలను నీళ్లు పట్టడమే ఆయన పని.ఈ సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేస్తూ, ‘మొక్కే కదా అని విదిలేస్తే.’ అనే డైలాగ్‌ను కొట్టాడు.
దీంతో మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోనే తెగ షేర్ చేస్తున్నారు.
మొత్తానికి మెగాస్టార్ ఇలా లాక్డౌన్ సమయంలో ఇంటి వద్ద ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ఫ్యా్న్స్ ప్రశంసిస్తున్నారు.