10 లేదా 15 కోట్లు పలికేది 150 కోట్లు... రాజమౌళి సినిమా అంటే అంతే మరి..!

టాలీవుడ్‌ దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లతో ఒక భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.

దాదాపుగా 250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని జక్కన్న తెరకెక్కిస్తున్నాడు.

సినిమా పూర్తి అయ్యేప్పటికి 300 కోట్ల వరకు బడ్జెట్‌ పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

ఇటీవలే రెండవ షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభం అయిన ఈ మల్టీస్టారర్‌ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ మరియు డిజిటల్‌ రైట్స్‌ అమ్ముడు పోయాయి.మామూలుగా స్టార్‌ హీరోల సినిమాలకు 10 నుండి 15 కోట్లకు శాటిలైట్‌ రైట్స్‌ అమ్ముడు పోతాయి.ఇంకా భారీ అంచనాలుంటే 25 కోట్లు హైలైట్‌.

కాని జక్కన్న సినిమాకు అలా ఎందుకు అవుతుంది, జక్కన్న ది గ్రేట్‌ డైరెక్టర్‌ కదా, అందుకే ఈ మల్టీస్టారర్‌ మూవీ రేట్లు ఆకాశంను దాటి ఉన్నాయి.

Advertisement

నిర్మాత దానయ్యకు ప్రస్తుతం మల్టీస్టారర్‌ రైట్స్‌ను అమ్మడం ఇష్టం లేదు.కాని ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఒకటి ఇచ్చిన ఆఫర్‌తో దానయ్య మరో మాట మాట్లాడలేక పోయాడు.50 కోట్లు వస్తాయనుకున్న శాటిలైట్‌ రైట్స్‌ను వంద కోట్లకు అడగడంతో రాజమౌళి కూడా కాదనలేక పోయాడు.శాటిలైట్‌ రైట్స్‌ మరియు డిజిటల్‌ రైట్స్‌ రెండు కలిపి ఏకంగా 150 కోట్లకు ఆ సంస్థ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది.

కేవలం శాటిలైట్‌ రైట్స్‌తోనే సగం బడ్జెట్‌ వచ్చిన నేపథ్యంలో ఇక జక్కన్న మూవీ ఏ స్థాయిలో క్రేజ్‌ను కలిగి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రాజమౌళి రెండవ షెడ్యూల్‌ను మొదలు పెట్టినా ఇంకా కూడా హీరోయిన్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు.రెండవ షెడ్యూల్‌లో కూడా ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు పాల్గొంటున్నారు.ఇద్దరి మద్య కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రం కోసం వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరిస్తున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో సమ్మర్‌లో లేదంటే దసరాకు విడుదలయ్యే అవకాశం ఉంది.పెద్దగా గ్రాఫిక్స్‌ లేకుండా ఈ చిత్రం ఉండబోతుంది.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు అయ్యేలా జక్కన్న సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఆ పార్టీ ప్రచారాల కోసం కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు : సుహాస్
Advertisement

తాజా వార్తలు