బాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమ లో పడ్డ రౌడీ హీరో...

విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) అంటే ప్రస్తుతం అందరికీ తెలిసిన హీరో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో.

నువ్విలా సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్ ఆ తర్వాత కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు.

ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమా( Pellichoopulu Movie ) ద్వారా హీరోగా మారి మొదటి సినిమాతోనే హీరోగా మంచి హిట్ అందుకున్నారు.పెళ్లిచూపులు, గీతగోవిందం అర్జున్ రెడ్డి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న విజయ్ రౌడీ హీరోగా గుర్తింపు పొంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

అయితే ఆ తర్వాత అన్ని వరుసగా ప్లాప్ అవుతున్నాయి.ఇక ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా( Liger ) అందరి అంచనాలను తారుమారు చేస్తూ విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

ప్రస్తుతం సమంత కి జోడిగా ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ మరొక ప్లాప్ నుండి తృటి లో తెప్పించుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

అనుకున్న విధంగా ఆ సినిమాలో నటించి ఉంటే విజయ్ కెరీర్లో మరొక ప్లాప్ ఉండేది.

అయితే లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఆ సినిమా ఫ్లాప్ నుండి విజయ్ బయటపడ్డాడు.అసలు విషయం ఏమిటంటే.లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా విడుదలైన తాజా చిత్రం అన్నీ మంచి శకునాలే.

మొదట ఈ సినిమా స్టోరీని నందిని రెడ్డి విజయ్ కి వినిపించింది.విజయ్ కూడా ఈ సినిమాలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఆ సమయంలో అర్జున్ రెడ్డి సినిమా విడుదలై విజయ్ రేంజ్ అమాంతం పెరిగి పోవడంతో విజయ్ తో సినిమా వర్కౌట్ కాదని నందిని రెడ్డి భావించి సంతోష్ శోభన్ తో మూవీని తెరకెక్కించింది.తాజాగా విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది.ఒకవేళ ఈ సినిమాలో నటించి ఉంటే అర్జున్ రెడ్డి కెరీర్ లో మరొక ప్లాఫ్ వచ్చి చేరేదని అంటున్నారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

నందిని రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల మరొక ప్లాప్ నుండి విజయ్ బయటపడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక అలాగే ఈ సినిమాతో పాటు విజయ్ క్రేజ్ పెరగడంతో మరి కొన్ని సినిమాలని కూడా వదులుకున్నాడు.

Advertisement

ఇక ఇది ఇలా ఉంటే విజయ్ ఈ మధ్య ఒక బాలీవుడ్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమ లో ఉన్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.మారి ఆ హీరోయిన్ ఎవరు అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

తాజా వార్తలు