టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.నాగచైతన్యతో (Nagachaitanya) విడాకులు తీసుకున్న తర్వాత ఈమె వరసగా సినిమా అవకాశాలను అందుకుంటూ ప్రస్తుతం తన సినిమాలు వెబ్ సిరీస్ ల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే తాజాగా సమంత కూడా సూటబుల్ మ్యాచ్ కోసం వెతుకుతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
ఇలా సమంత సూటబుల్ మ్యాచ్ కోసం వెతుకుతున్నాను అంటూ పోస్ట్ చేయడంతో సమంత రెండో పెళ్లి సిద్ధమైందా అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈమె మ్యాచ్ వెతుకుతున్నది తన కోసం కాదని సెలబ్రిటీలకు చికిత్స అందిస్తూ డాక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన డాక్టర్ జేవల్ గమాడియా కోసం ఈమె మ్యాచ్ వెతుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.జేవల్ గమాడియా కోసం మ్యాచులు వెతుకుతున్నాం ఆయన పైకి కనిపించే దానికన్నా ఎంతో తెలివైనవంతుడు అంటూ పోస్ట్ చేశారు.
ఇలా డాక్టర్ కోసం సమంత మ్యాచ్ లు వెతుకుతున్నారని తెలియడంతో సమంత విడాకులు తీసుకున్నప్పటికీ తనకు వివాహ బంధం పై ఎంతో నమ్మకం గౌరవం ఉందని అర్థమవుతుంది.ఇక సమంత మ్యాచ్ చూస్తున్న ఆ డాక్టర్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.ఈయన ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు వెస్టర్న్ ఆక్యుపంచర్ పద్ధతి ద్వారా చికిత్స అందిస్తున్నారు.
ఈయన లిస్టులో కత్రినా కైఫ్, అనుష్క శర్మ, అజయ్ దేవగన్ ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నారు.అయితే తాజాగా సమంత కూడా ఈయన పేషెంట్ జాబితాలో చేరిపోయిందని ఈ పోస్ట్ చూస్తేనే అర్థమవుతుంది.