ఆసియా కప్ ఫైనల్ విజయం పై స్పందించిన రోహిత్ శర్మ.. క్రెడిట్ అంతా అతనిదే..!

ఆసియా కప్ 2023( Asia Cup 2023 ) ఫైనల్ విజయం చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

భారత్ ఎన్నో టైటిల్లను గెలిచింది కానీ ఈ ఆసియా కప్ 2023 టైటిల్ భారత్ కు ఎంతో స్పెషల్ అని తెలుపుతూ ఈ విజయం క్రెడిట్ మొత్తం మహమ్మద్ సిరాజ్ దే అని ప్రశంసించాడు.

సిరాజ్ సామర్థ్యం పై తనకు ఎంతో నమ్మకం అని ప్రశంసలతో ముంచెత్తాడు.గాలిలో బంతి మూవ్ చేసే పేసర్లు చాలా అరుదు.

అటువంటి వారిలో మహమ్మద్ సిరాజ్ ఒకడని తెలిపాడు.

ఆదివారం శ్రీలంక( Sri Lanka )లోని కొలంబో వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక జట్టు 50 పరుగులకే ఆల్ అవుట్ అయిన సంగతి తెలిసిందే.సిరాజ్ 7 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీశాడు.ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీయడంతో లంకా ఘోరంగా విఫలమైంది.

Advertisement

ఇక హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీసుకున్నారు.అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత జట్టు 6.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 51 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో రెండవ ఓవర్ అనంతరం వార్ వన్ సైడ్ అయింది.నిజంగా రెండో ఓవర్లోనే ఏకంగా లంక ఐదు వికెట్లను కోల్పోయింది.ఉత్కంఠ భరితంగా చివరి వరకు సాగాల్సిన ఫైనల్ మ్యాచ్ ఇలా తొందరగా వార్ వన్ సైడ్ కావడంతో అభిమానులంతా ఆశ్చర్యపోయారు.

ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ( Rohit Sharma ) మాట్లాడుతూ.బంతితో అద్భుతమైన ఆరంభం దక్కడం, బ్యాట్ తో మంచి ముగింపు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, వికెట్స్ పడుతుంటే తాను చూస్తూ నిలబడి పోయానని తెలిపాడు.

ఈ విజయం క్రెడిట్ అంతా మహమ్మద్ సిరాజ్( Mohammed Siraj ) దే అని, ఒకే ఓవర్ లో నాలుగు వికెట్ తీసి శ్రీలంక బ్యాటర్లను పెవిలియన్ చేయడం నిజంగా ఒక అద్భుతం అని తెలిపాడు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..
Advertisement

తాజా వార్తలు