ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు( Heavy Rains in Telangana ) కురవటం తెలిసిందే.వారం రోజుల నుండి ఎడతెరిపి లేని కురిసిన వర్షాలకు తెలంగాణలో నువ్వు తట్టు ప్రాంతాలలో ఇంకా గ్రామాలలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది.
వరద నీళ్లు ఇళ్లల్లోకి రావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికార సిబ్బంది తరలించడం జరిగింది.ప్రస్తుతం ఇంకా కొన్ని గ్రామాలలో వరద నీరు ఉండటంతో ప్రజలను పునరావాస కేంద్రాలలోనే ఉంచుతూ ఉన్నారు.
ఇదే సమయంలో చాలా వాగులు మరియు నదులు పొంగిపొర్లటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రహదారులు డ్యామేజ్ అయ్యాయి.
భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం కావడంతో కొన్నిచోట్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి.
అయితే శనివారం కాస్త వాతావరణం నెమ్మదించడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా 1064 ప్రాంతాలలో రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలియజేశారు.
ఈ రోడ్ల మరమ్మతులకు( Road Repairs ) సుమారు ₹1000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు.పరిస్థితి ఇలా ఉండగా ఇదే రీతిలో ఆగస్టు మాసంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది.