నంద్యాలలో రోడ్డుప్రమాదం( Road accident in Nandyala ) జరిగింది.పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్( NND Farooq ) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
నంద్యాల నుంచి కర్నూలుకు వెళ్తున్న సమయంలో రోడ్డుపై అడ్డంగా వచ్చిన గేదెలను కారు ఢీకొట్టింది.దీంతో కారు ముందుభాగం అంతా నుజ్జునుజ్జు అయింది.
అయితే కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ఎన్ఎండీ ఫరూక్ స్వల్ప గాయాలతో బయపడ్డారని సమాచారం.