మౌనరాగం.( Mounaragam ).1986లో విడుదలైన అద్భుతమైన క్లాసిక్ లవ్ స్టోరీ.ప్రేమ పెళ్లి అనే రెండు బంధాల మధ్య నలిగిపోయిన ఒక అమ్మాయి కథ.మౌనంగా వేదన చెందే మనసు పలికే ఒక రాగం.మణిరత్నం( Mani Ratnam ) ఇలాంటి ఒక క్లాసిక్ లవ్ స్టోరీ ని తీసి ఉంటారని ఊహించడం కూడా కష్టంగా ఉంది ఎందుకంటే ఈ సినిమా చూసిన ప్రతిసారి మనసుని గుండెను ఆకట్టుకుంటూనే ఉంటాయి.
దీనికి తోడు ఆ సినిమా యొక్క సంగీతం, నేపథ్య సంగీతం కూడా చాలా అద్భుతంగా కుదిరాయి.ఒక సినిమాని సినిమాగా చూడటం కన్నా ప్రతి మనసు పడే వేదనలా చూడడమే ఈ చిత్రం యొక్క స్పెషాలిటీ.
అప్పటికి ఇప్పటికి ఈ సినిమా చూసిన ప్రతిసారి కళ్ళు చమర్చకుండా ఉండలేము.అంత అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది ఈ ప్రేమ కథ చిత్రం.

మౌనరాగం సినిమా మాతృక తమిళ్ లో జరిగే కింది తెలుగులో ఇది డబ్బింగ్ మాత్రమే చేయబడింది.కానీ అక్కడ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలుగులో కూడా అంతే విజయాన్ని అందుకుంది.సాధారణంగా ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలు చూడ్డానికి బాగుంటాయి కానీ కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ చూసిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తాయి.కానీ మౌనరాగం సినిమా వీటన్నిటికీ భిన్నమైనది కమర్షియల్ గాను అద్భుతమైన విజయాన్ని అందుకొని నిర్మాతను కూడా ఈ సినిమా ఆదుకుంది.
ఇక ఈ సినిమాకి పీసీ శ్రీరామ్( PC Shriram ) చాయ గ్రహణం ఎంతో చక్కగా కుదిరింది.ప్రతి ఒక్కరు సినిమా చూసిన ప్రతిసారి అతని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు.
ఎంతో సరలమైన ప్రేమ కథను కూడా అద్భుతంగా చూపియ్యడం మనిరత్నం కి మాత్రమే చెల్లింది.

1986లోనే ఇలాంటి ఒక కథ రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ సినిమాలో నటించిన రేవతి, కార్తీక్, మోహన్( Revathi, Karthik, Mohan ) అద్భుతంగా నటించారు.సినిమాలో కార్తీక్ కాసేపు కనిపించిన మనసులో నిలిచిపోతాడు.అలాగే రేవతి నటన కూడా అమోఘం.
మనసులో ఒకరు తాళి కట్టిన భర్త మరొకరు.ఎవరికి న్యాయం చేయాలో తెలియని పాత్రలో రేవతి చాలా చక్కగా నటించింది.
ఇళయరాజా తన సంగీతంతో ఈ చిత్రానికి ప్రాణం పోశారు.ప్రతి ఒక్కరూ మళ్ళీ ఒకసారి ఈ సినిమా చూసి కల్ట్ క్లాసిక్ మూవీ అని మురిసిపోవాల్సిందే.







