తెలంగాణ బడ్జెట్ ను ప్రభుత్వం మార్చి 7న ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే.అయితే బడ్జెట్ పై ప్రజల్లో పెద్ద ఎత్తున అంచనాలు నెలకొననున్న పరిస్థితి ఉంది.
అయితే బడ్జెట్ లో ఏ పధకాలకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారనే దానిపై ఒక్కొక్కరికి ఒక్కో అంచనాలు ఉన్నా ప్రభుత్వ విధానం ఎలా ఉందనేది మాత్రం ఇంతవరకు బయటికి రాకున్నా మార్చి 7 న హరీష్ రావు బడ్జెట్ చిట్టా విప్పనున్నారు.ప్రతిపక్షాలు బడ్జెట్ ప్రవేశపెట్టాక బడ్జెట్ లో ఉన్న లోపాల గురించి స్పందించే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే దళితబంధుకు ఎక్కువ నిధులు కేటాయిస్తారని భావిస్తుండగా, రైతు బంధును పది ఎకరాల లోపు వరకు కలిగి ఉన్న రైతులకు మాత్రమే వర్తింపజేయాలనే ఒక ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే బడ్జెట్ లో దళిత బంధు ప్రకటించినట్టుగా బీసీ బంధు కూడా ప్రవేశపెట్టాలనే డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది.
అంతేకాక బీసీలకు పది వేల కోట్లు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య లాంటి నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున బడ్జెట్ పై పెద్ద ఎత్తున డిమాండ్ లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ రకమైన వాదనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా లేదా అనేది బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో కొంత కొంత అవగాహనకు వచ్చే అవకాశం ఉంది.అయితే ఎంత మేరకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తుంది అంతేకాక కొత్తగా ఏమైనా పధకాలు ప్రవేశ పెడుతుందా ఏ పధకాల నిధులలో ప్రభుత్వం కోత పెడుతుందా అనేది ఇప్పుడు మరొక చర్చ జోరుగా కొనసాగుతోంది.ప్రభుత్వం మాత్రం ఇది ప్రజాకర్షక బడ్జెట్ అని చాలా రకాల సమస్యలకు ఈ బడ్జెట్ ద్వారా కొంత పరిష్కారం లభించే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి ఉంది.