సరికొత్త పాఠం నేర్పుతున్న కాంతారా.. మరి మార్పు వస్తుందా?

చిన్న సినిమాగా వచ్చిన కన్నడ సినిమా ఇండియన్ సినిమాకు కొత్త పాఠాలు నేర్పిస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.

ఎందుకంటే ఈ చిన్న సినిమా విజయాన్ని చూసి అందరు ఇదే విషయం చర్చించు కుంటున్నారు.

కన్నడ లోనే కాకుండా రిలీజ్ అయినా అన్ని చోట్ల రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతుంది.దీంతో అంతా ఈ సినిమాపై ప్రశంసలు అందింస్తున్నారు.

మరి ఇంతకీ ఆ సినిమా ఏంటో మీకు ఈ పాటికే తెలిసే ఉంటుంది కదా.ఆ అవును ఆ సినిమా కాంతారా.రిషబ్ శెట్టి సప్తమి గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన కాంతారా సినిమా కన్నడంలో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర అసాధారణమైన విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇక ఈ సినిమా పరుగులు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాను రిషబ్ శెట్టినే డైరెక్ట్ చేసాడు.అయితే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా సినిమా అంటే ఎలా ఉండాలో కూడా కొత్త పాఠం నేర్పుతుంది.

Advertisement

సినిమా అంటే భారీ సెట్టింగులు.ఇంకా సూపర్ స్టార్స్.

భారీ బడ్జెట్.అద్భుతమైన విఎఫ్ఎక్స్ వంటివి ఉంటేనే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు అని అనుకునే వారికీ ఈ చిన్న సినిమా గుణపాఠం చెప్పింది.

ఈ సినిమాలో ఎలాంటి భారీ తారాగణం లేదు.ఏమీ లేకుండానే కాంతారా సినిమా భారీ సినిమాల రికార్డ్ లను సైతం బ్రేక్ చేసి కొత్త దారులు చూపిస్తుంది.ఈ సినిమాలో రిషబ్ శెట్టి మినహా చెప్పుకోదగ్గ నటులు లేరు.

ఇంకా భారీ బడ్జెట్ కానీ.భారీ సెట్టింగ్స్ కానీ లేవు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

కానీ బలమైన కథ ఉంది.ఇదే ప్రేక్షకులను ఈ సినిమా వైపు నడిచేలా చేస్తుంది.

Advertisement

అన్ని వర్గాల.అన్ని భాషల ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సినిమా ఇప్పుడు సంచలనంగా మారిపోయింది.

ఇప్పటికే భారీ కలెక్షన్స్ రాబట్టి ఇంకా భారీ వసూళ్ల దిశగా ముందుకు వెళుతుంది.

తాజా వార్తలు