జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరికలు జారీ చేశారు.తనకే చెప్పులున్నట్లు పవన్ మాట్లాడారని మండిపడ్డారు.
కానీ మేం అంతకన్నా ఎక్కువ మాట్లాడగలమని చెప్పారు.ఆరు శాతం ఓటింగ్ ఉన్న పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడితే 50 శాతం ఓటింగ్ ఉన్న మేము మీదపడితే ఏమవుతుందో ఊహించుకో అని హెచ్చరించారు.
పవన్, చంద్రబాబులు ఇద్దరూ వచ్చినా ఏమీ పీకలేరని అనిల్ వ్యాఖ్యనించారు.పవన్, చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోసారి పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చిరిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఒక పార్టీ అధ్యక్షుడు ఇలా మాట్లాడొచ్చా అని ఆయన ప్రశ్నించారు.12 ఏళ్లు తనను ఎంతో తిట్టి, ఇబ్బంది పెట్టినా చిరునవ్వుతో వాటిని అధిగమించి సీఎం అయిన వ్యక్తి జగన్ అని తెలిపారు.నాయకుడు ఎలా ఉండాలన్న దానికి జగన్ ఉదాహరణ అని వెల్లడించారు.







