‘పరాన్నజీవి’పై పీకే ఫ్యాన్స్‌ టాక్‌

రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందించిన ‘పవర్‌ స్టార్‌’ చిత్రానికి పోటీ అన్నట్లుగా విడుదలైన పరాన్నజీవి చిత్రంపై పవన్‌ ఫ్యాన్స్‌ పాజిటివ్‌ యాక్షన్‌తో ఉన్నారు.

వర్మ పవర్‌ స్టార్‌ మూవీలో పవన్‌ కళ్యాణ్‌ ను అవమానించేలా మాట్లాడాడు.

పవన్‌ రాజకీయాల్లో ఓడిపోయిన తర్వాత చేసిన పని గురించి మాట్లాడాడు.దాంతో వర్మను టార్గెట్‌ చేస్తూ నూతన్‌ నాయుడు తెరకెక్కించిన చిత్రం పరాన్నజీవి.

వర్మ తీసుకు వచ్చిన విధంగానే పరాన్న జీవిని కూడా డిజిటల్‌ ఫార్మట్‌లోనే విడుదల చేశారు.పరాన్నజీవి చిత్రం మొత్తంగా 40 నిమిషాల పాటు సాగింది.

ఈ నలబై నిమిషాల్లో కూడా ఎక్కువగా ఆర్జీవీ అమ్మాయిలతో ఎంజాయ్‌ చేయడం, వోడ్కా తాగుతూ ఏ సినిమా తీయాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్లుగా ఎవరిపై పడితే వారిపై సినిమా చేసేందుకు సిద్దం అవ్వడం చేస్తాడు.అలా పవన్‌ పై సినిమా తీయాలనుకున్న వర్మను రచ్చ రచ్చగా పవన్‌ ఫ్యాన్స్‌ దాడి చేస్తారు.

Advertisement

దాంతో ఆర్జీవీలో మార్పు వస్తుంది.ఇంకెప్పుడు పవన్‌ జోలికి రాకుండా ఉంటానంటాడు.

ఈ సినిమాలో చెప్పుకోవడానికి ప్రత్యేకమైన ఎలిమెంట్స్‌ కాని స్పెషల్‌ మూమెంట్స్‌ కాని ఏమీ లేవు.కాని పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం నవ్వు కునే విధంగా ఆర్జీవీని టార్గెట్‌ చేసే సీన్స్‌ ఉన్నాయి.పవన్‌ ఫ్యాన్స్‌కు మాత్రమే అన్నట్లుగా ఉన్న ఈ సినిమా వారికి అయితే బాగానే నచ్చి ఉంటుంది.

నూతన్‌ నాయుడు వారికి ఒక కొత్త ఆశా దీపం మాదిరిగా కనిపిస్తున్నాడు.

బడా హీరోలకోసం బలగం వేణు వెంపర్లాట... అదే ఆలస్యం చేస్తోందా?
Advertisement

తాజా వార్తలు