రామ్ గోపాల్ వర్మ ఈ మద్య కాలంలో ఎక్కువగా బూతు కంటెంట్‌కు ప్రాముఖ్యత ఇస్తున్నాడు అనే విషయం తెల్సిందే.మియా మాల్కోవాతో ఆయన తెరకెక్కించిన ‘క్లైమాక్స్’ చిత్రం నిన్న డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై విడుదల అయ్యింది.
రాత్రి 9 గంటలకు సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది.ఒకేసారి వేలాది మంది పడటంతో కొద్ది సమయం సదరు యాప్ హ్యాంగ్ అయ్యిందని కూడా తెలుస్తోంది.
కొందరు వెంటనే చూడాలనుకున్నా కూడా సాధ్యం కాలేదు.
ఓటీటీ మాదిరిగా కాకుండా ఈ సినిమాను విభిన్నమైన కాన్సెప్ట్‌తో విడుదల చేశారు.
సినిమా చూడాలి అంటే 100 రూపాయలు చెల్లించాలి.సినిమాకు మంచి పబ్లిసిటీ చేయడంతో పాటు వర్మ విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తి అంచనాలు పెంచింది.
ఆ కారణంగా ఈ సినిమాను మొదటి రోజు ఏకంగా మూడు లక్షల మంది వరకు చూసినట్లుగా ట్రెండ్ వర్గాల వారు చెబుతున్నారు.

మూడు లక్షల వ్యూస్ అంటే ఒక్క వ్యూ కు వంద రూపాయల చొప్పున మూడు కోట్లు వచ్చి ఉంటాయి.వర్మ మొదటి రోజే మూడు కోట్ల వసూళ్లు సాధించాడు.థియేటర్ల ద్వారా కూడా ఇంత భారీ మొత్తం సాధ్యం కాదేమో అంటున్నారు.
మొత్తానికి వర్మ తీసుకు వచ్చిన ఈ సరికొత్త విధానం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ఇలా అమౌంట్ పెట్టి చూడటం వల్ల నిర్మాతలకు మంచి లాభాలు వస్తాయని అంటున్నారు.