కాంగ్రెస్ ముందు చూపు ! ఆ పదవుల భర్తీ ఎప్పుడంటే ?

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గతంతో పోలిస్తే బాగా యాక్టివ్ అయింది.

ప్రధాన పార్టీలుగా ఇప్పటి వరకు తెలంగాణలో ప్రాబల్యం చూపించిన బిజెపి, టిఆర్ఎస్ పార్టీ లకు ధీటుగా కాంగ్రెస్ సైతం పోటీ లోకి వచ్చింది.

కొత్త పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత కాంగ్రెస్ లో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తోంది.ఆయన సారథ్యంలో పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో చాలా మంది ఇతర పార్టీల నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ బాట పడుతున్నారు.

ఇక హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతోంది.ఎవరూ ఊహించని వారిని ఇక్కడ అభ్యర్థులుగా ఎంపిక చేసేందుకు రేవంత్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రవేశపెడుతున్న పథకాలకు గట్టిగా కౌంటర్లు ఇవ్వడంతోపాాటు, టిఆర్ఎస్ ప్రచార సభలకు కౌంటర్ గా కాంగ్రెస్ కూడా సభలను నిర్వహిస్తూ టిఆర్ఎస్ కు గట్టి కౌంటర్ ఇస్తోంది. కెసిఆర్ ప్రకటించిన దళిత బంధు పథకం ఆ పార్టీకి మైలేజ్ తీసుకు వస్తుందని అంతా భావిస్తుండగా, దానికి కౌంటర్ గా మిగతా కులాలకు టిఆర్ఎస్ అన్యాయం చేస్తుందనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రేవంత్ గట్టిగా ప్రయత్నాలు  చేస్తున్నారుు.ఇంద్రవెల్లి సభలో ఈ మేరకు గట్టి కౌంటర్ లు కెసిఆర్ కు ఇచ్చారు.40 రోజుల పాటు దళిత దండోర కార్యక్రమాన్ని చేపట్టి తరువాత అనేక కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు.దీంతో పాటు పెద్ద ఎత్తున పార్టీలో పదవుల భర్తీ చేపట్టి నాయకుల్లో ఉత్సాహం నింపాలి అని చూస్తున్నారు.

Advertisement

ఈ మేరకు మరో ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. 

అలాగే గత మూడు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న కార్యవర్గ విస్తరణ ఇప్పుడు చేపట్టాలని చూస్తోంది. పార్టీలో పదవులు దక్కని వారు తీవ్ర అసంతృప్తికి గురి అవుతూ ఉండడంతో, వారి అసంతృప్తిని పోగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.పార్టీలో ఖాళీగా ఉన్న పదవులు అన్నింటిని భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం చేపట్టబోయే కార్యనిర్వాహక పదవులలో ఒకటి మున్నూరు కాపు సామాజిక వర్గం, రెండవది మాదిగ సామాజిక వర్గం నుంచి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.తెలంగాణలో బలమైన నాయకులుగా ఉన్న కొండా సురేఖ ప్రాధాన్యం పెరిగేలా, ఆమె భర్త కొండా మురళికి పదవి కట్టబెట్టాలని చూస్తున్నారు.

ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం, అలాగే కొండ సురేఖ పద్మశాలి వర్గానికి చెందినవారు కావడంతో ఆ సమీకరణాలు కలిసి వస్తాయని అభిప్రాయపడుతున్నారు.అన్ని సామాజిక వర్గాలకు పదవుల్లో ప్రాధాన్యం ఉండే విధంగా చూసుకుంటూ కాంగ్రెస్ కు కొత్త జవసత్వాలు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు