తెలంగాణలో రాజకీయాలు చలికాలంలో కూడా చాలా వేడిని పుట్టిస్తున్నాయి అక్కడ నేతలకి.ముఖ్యంగా రేవంత్ టిటిడిపిని వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాక మరికొంతమందికి కూడా కాంగ్రెస్ కండువాలు కప్పించాడు దాంతో టిటిడిపి సినియార్ నాయకులు మండిపడుతున్నారు.
రేవంత్ ఒక చీడ పురుగు ఇప్పుడు ఆ చీడ తెలుగుదేశం పార్టీని వదిలి కాంగ్రెస్ కి పట్టింది అని విమర్శిస్తున్నారు.రాజకీయాల్లో ఇవన్నీ సహజమేగా.
పోనిలే అనుకోవచ్చు కానీ ఇక్కడ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు అంటున్న మాటలు.ఎలా అర్థం చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు కాంగ్రెస్ నాయకులు.విషయమేమిటంటే
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ముఖ్యమంత్రి పదవిపై ప్రస్తావనకు తెచ్చారు.రేవంత్ రెడ్డి తన అనుయాయులతో రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత జానారెడ్డి మనసులో మాట బయటపెట్టారు.
ఎక్కడ తన పదవికి ఎసరు తెస్తాడో అని తొందరపడిన కోయిలలా ముందే కూసేశారుమొన్నా మధ్య సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లో బాగుబలి తో పోల్చడం అందరికీ తెలిసిన విషయమే సినీ బాహుబలి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో నోట్ల వర్షం కురిపిస్తే… రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బాహుబలిగా ఓట్ల వర్షం కురిపిస్తాడనే అభిప్రాయంతో ట్వీట్ చేశారు.వర్మ చేసిన ఆ ట్వీట్ జానారెడ్డి లో గుబులు రేపుతోంది.
అందుకే జానా బాహుబలి పై వివరణ ఇచ్చారు
పార్టీలో చేరిపోగానే ఎవ్వరూ బాహుబలి అవ్వలేరు .అందరు ఒక్కటే కానీ ఇక్కడ పార్టీని గెలిపించినోడే బాహుబలి.శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటేనే బాహుబలి అని అన్నారు.దాంతో రేవంత్ రాక జానా రెడ్డిలో ఎంత టెన్షన్ తీసుకువస్తోందో అర్థం అవుతోంది.రేవంత్ రెడ్డి తన చాతుర్యంతో రాజకీయాల్లో చక్రం తిప్పగలడనే విశ్వాసం రాహుల్ గాంధీకి కలిగించారు.తెలంగాణలో టిఆర్ ఎస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా తనలోనే ఉందని రేవంత్ రెడ్డి తొలిరోజే నిరూపించే ప్రయత్నం చేశారు.
రేవంత్ కనుక తెలంగాణా లో నిర్వహించే రాహుల్ సభని భారీ సక్సెస్ చేస్త్తే.రాహుల్ కి మరింత నమ్మకం కలిగించుకుంటే.
సిఎం రేసులో ఉండటం పెద్ద విషయమేమీ కాదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.