రేవంత్ రెడ్డి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు..: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy )పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వంద మీటర్ల లోతులో బీఆర్ఎస్ ను బొంద పెడుతా అంటే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోరా అని కడియం శ్రీహరి ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి కావాలనే బీఆర్ఎస్ పార్టీని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఛార్లెస్ - ఓబుల, బిల్లా - రంగా అని తమ వారిని విమర్శిస్తున్నారన్న కడియం శ్రీహరి మీ చరిత్ర, మీపై ఎన్ని కేసులు ఉన్నాయో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు.

ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చారన్న ఆయన కేవలం రెండు హామీలు అమలు చేశారని తెలిపారు.ఈ క్రమంలోనే రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS party ) సత్తా ఏంటో చూపిస్తామని వెల్లడించారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు