సంచలనం రేపబోతున్న రేవంత్ అదేంటంటే ? 

ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ వస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో సంచలనం రేకెత్తించేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు.

సీనియర్ నాయకులు ఎవరూ ఆయనకు సరైన సహకారం అందించడం లేదు. సొంత పార్టీలోనే గ్రూపు రాజకీయాలు ఎక్కువవడంతో రేవంత్ అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సొంత పార్టీలో ఇబ్బందులను పరిష్కరించుకుంటూనే, మరోవైపు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పై ఆయన పోరాటం చేస్తున్నారు.తాను పిసిసి అధ్యక్షుడు కాకముందు కాంగ్రెస్ కు వరుస ఓటములు ఎదురవడంతో ఇప్పుడు ఆ పరిస్థితి మార్చాలని ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికలు ఉండడంతో పాటు,  2023 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ అంతటా పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తుండగా, వైఎస్ఆర్ టిపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి త్వరలోనే పాద యాత్ర చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.అదీ కాకుండా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా  ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే పాదయాత్ర నిర్వహించాలని , దీని ద్వారా పార్టీ కేడర్లో ఉత్సాహం పెంచడంతో పాటు, ప్రజల్లోకి కాంగ్రెస్ ని బలంగా తీసుకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది అని నమ్మకంగా ఉన్నారు.

ఇప్పటికే పాదయాత్ర కు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం వద్ద అనుమతి కూడా తెచ్చుకున్నట్టు తెలుస్తోంది.

ఈ మేరకు త్వరలోనే పాదయాత్ర చేపట్టడంతో పాటు, ఆ యాత్ర లోనే ఏ ఏ నియోజకవర్గానికి ఎవరిని అభ్యర్థిగా నియమించాలనే విషయంలో క్లారిటీ తెచ్చుకోవాలి అనేది రేవంత్ ప్లాన్ గా తెలుస్తోంది.తెలంగాణ అంతటా జరగబోయే ఈ పాదయాత్రలో అన్ని జిల్లాలు, అన్ని నియోజక వర్గాలను టచ్ చేసే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.ఈ యాత్రలో ముఖ్యంగా టిఆర్ఎస్, బిజెపి లను టార్గెట్ గా చేసుకోబోతున్నట్లు సమాచారం.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు