ఏసీబీ రమ్మంది...హైకోర్టు కదలొద్దంది...!

నోటుకు ఓటు కుంభకోణంలో ప్రధాన నిందితుడైన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి రెండు కోర్టుల మధ్య నలిగిపోయారు.

సోమవారం ఆయనకు ఈ విపత్కర పరిస్థితి ఎదురైంది.

ఏం జరిగిందంటే.నోటుకు ఓటు కేసులో విచారణకు హాజర కావాల్సిందిగా ఏసీబీ న్యాయస్థానం రేవంత్‌ను ఆదేశించింది.

మరి న్యాయస్థానం ఆదేశించాక హాజరు కావాలి కదా.! కాని ఆయన కాళ్లకు హైకోర్టు వేసిన బంధాలు ఉన్నాయి.అంటే కాళ్లు కట్టేశారని కాదు.

హైకోర్టు రేవంత్‌కు బెయిల్‌ ఇచ్చినప్పుడు మీ నియోజకవర్గమైన కొడంగల్‌ నుంచి ఎక్కడికీ కదలొద్దు.ఎక్కడికైనా వెళ్లాలంటే మా అనుమతి తీసుకోవాలి అని షరతు విధించింది.

Advertisement

దీంతో ఆయన హైకోర్టు నుంచి నేరుగా కొడంగల్‌ (మహబూబ్‌నగర్‌ జిల్లా) వెళ్లిపోయారు.అయితే విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ కోర్టు ఆదేశించింది.

కాని హైకోర్టు అనుమతి లేనిదే హైదరాబాదుకు రాకూడదు కదా.! దీంతో రేవంత్‌ తరపు న్యాయవాదులు హైకోర్టు ఉత్తర్వులను ఏసీబీ కోర్టుకు చూపించారు.దీంతో ఆగస్టు మూడో తేదీలోగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

రేవంత్‌ రెడ్డి ఆంక్షలు విధించిన సంగతి ఏసీబీ కోర్టుకు తెలియదా? ఒక కోర్టు ఉత్తర్వుల గురించి మరో కోర్టుకు తెలియకపోవడం విచిత్రంగా ఉంది.రేవంత్‌ రెడ్డిని హైదరాబాదులో ఉండనీయనిది ఏసీబీ అధికారులే.

ఆయన రాజధానిలో ఉంటే సాక్ష్యాలు తారుమారు చేయొచ్చని, ఇంకా ఏమైనా చేస్తాడని, కాబట్టి అసలు బెయిలే ఇవ్వొద్దని వాదించారు.అయితే వారి భయాలను తోసిపుచ్చిన హైకోర్టు చివరకు హైదరాబాదులో ఉండొద్దన్న ఆంక్ష పెట్టి బెయిల్‌ ఇవ్వడంతో ఏసీబీ అధికారులు తృప్తి పడ్డారు.

గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!
Advertisement

తాజా వార్తలు