దేవుడా: 60 ఏళ్ల తర్వాత లైబ్రరీకి పుస్తకాన్ని తిరిగి ఇచ్చిన ఘనుడు..!

మామూలుగా మనం మన ఊరిలోని లైబ్రరీలలో లేకపోతే పాఠశాల రోజులలో కానీ, మన కాలేజ్ డేస్ లో కానీ.

ఉన్న లైబ్రరీలలో పుస్తకాలు తీసుకొని ఉండే ఉంటాం.

అయితే పుస్తకం తీసుకున్న తర్వాత వాటిని తిరిగి ఇచ్చేందుకు కొద్దిగా గడువు ఇస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఒక్కొక్కసారి ఇచ్చిన గడువులోగా తిరిగి ఇవ్వడం మరచిపోతూ ఉంటాం.

అలాగే కొన్ని సార్లు వివిధ కారణాలతో ఆలస్యంగా ఇస్తూ ఉంటాం.ఇది మనందరికీ అనుభవం అయ్యే ఉంటుంది.

ఇలా ఒక వేళ మరిచిపోయినా ఏదో రోజులు, లేకపోతే వారాలు, మహా అయితే నెలలు ఆ తర్వాత అయినా ఆలస్యంగా మేలుకొని మన పుస్తకాన్ని వాపస్ చేస్తాం.ఇక అసలు విషయంలోకి వెళితే.

Advertisement

ఇంగ్లాండ్ లోని ఓ లైబ్రరీలో ఓ వ్యక్తి పుస్తకం తీసుకున్న 60 సంవత్సరాల తర్వాత దానిని రిటర్న్ చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ చేయడం ద్వారా ఎందుకు ఆలస్యంగా ఇచ్చావు అని ప్రశ్నలు వేయకుండా.

పుస్తకాన్ని తిరిగి ఇచ్చినందుకు ఆ వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఆ లైబ్రరీ సిబ్బంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

జాఫ్రీ ఫాబెర్ అనే రచయిత రచించిన కవిత పుస్తకాన్ని ఈ మధ్యనే లైబ్రరీ బుక్ రిటన్ విభాగానికి ఓ గుర్తు తెలియని వ్యక్తి అందించాడు.అయితే ఆ పుస్తకాన్ని తీసుకొని ఇప్పటికి 60 సంవత్సరాలు దాటేసింది.1962 డిసెంబర్ 21న ఆ పుస్తకాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉండేది.కాకపోతే, అప్పుడు ఇవ్వాల్సిన పుస్తకం కొద్దిగా ఆలస్యం అయి ఇప్పుడు ఆ లైబ్రరీ కి చేరుకుంది.

ఇక లైబ్రరీ స్టాఫ్ ఇచ్చిన సమాచారం మేరకు.ప్రస్తుతం కరోనా సమయంలో జరిమానాలు నిలిపివేసినందున పుస్తకం అనామకంగా తిరిగి వచ్చిందని తెలుపుతున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ పుస్తకం ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి లైబ్రరీకి చేరుకోవడంతో ఆ లైబ్రరీ సంబంధించిన లైబ్రేరియన్ అలాగే కమ్యూనిటీ హబ్ ఆఫీసర్ డేవిడ్ మాట్లాడుతూ.ఈ పుస్తకాన్ని తిరిగి ఇచ్చిన అపరిచిత వ్యక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు.

Advertisement

ఈ పుస్తకం మళ్ళీ లైబ్రరీలో మిగతా పుస్తకాల తో కలిసి ఉండడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.భవిష్యత్తులో చాలామంది ఈ పుస్తకాన్ని రిఫరెన్స్ లైబ్రరీలో తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు