అకిరా ఇంకా చిన్నపిల్లాడు.. అలాంటి వాటిపై ఆసక్తి లేదు: రేణూ దేశాయ్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల కుమారుడు అకిరా నందన్.

ఈమధ్య ఇతడి పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఇప్పటివరకు ఇండస్ట్రీకి పరిచయం లేని అకిరాకు పవన్ అభిమానుల నుండి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.పవన్, రేణు విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యత మొత్తం రేణు దేశాయ్ చూసుకుంటుంది.

ఇదిలా ఉంటే ఓ విషయంలో అకిరా చిన్న పిల్లవాడు అంటూ ఓ కామెంట్ చేసింది.రేణుదేశాయ్ సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను, తన పిల్లల ఫోటోలను బాగా పంచుకుంటుంది.అంతేకాకుండా గతంలో అకిరా నందన్ ఫోటోలు పంచుకోగా పవన్ అభిమానులు మాత్రం తెగ లైక్స్ చేశారు.

Advertisement

పైగా ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్నలు కూడా వేశారు.కానీ అతడికి సినిమాలంటే ఇష్టం లేదు అంటూ సమాధానమిచ్చింది.

ఈ మధ్య అకిరా కర్ర సాము చేసిన వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకున్న సంగతి తెలిసిందే.ఇక ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా చాలామంది అకిరా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడని.నటన కోసం శిక్షణ తీసుకోవడానికి అమెరికాకు పంపడానికి పవన్ కూడా ఏర్పాట్లు చేశారని బాగా వార్తలు వినిపించాయి.

దీంతో పవన్ అభిమానులు అకిరా ఎంట్రీ ఉంటుందని తెగ సంతోష పడ్డారు.కానీ తాజాగా రేణు దేశాయ్ చెప్పిన మాటల పట్ల అకిరా ఎంట్రీ లేదని తెలుస్తుంది.

సోషల్ మీడియాలో అభిమానులతో కాసేపు ముచ్చటించింది రేణు దేశాయ్.కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ప్రస్తుతం కోవిడ్ వల్ల ఇంట్లోనే ఉంటున్నానని తెలిపింది.అలా కొందరు అకిరా గురించి కూడా కొన్ని ప్రశ్నలు వేశారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

సినీ ఇండస్ట్రీకి ఎప్పుడు పరిచయమవుతున్నాడు అని ప్రశ్నించగా.అకిరా ఇప్పుడు సినిమాల్లోకి రాడని అలాంటి ఉద్దేశం కూడా లేదని చెప్పేసింది.

Advertisement

అతను ఇంకా చిన్నపిల్లవాడే అంటూ కేవలం15 ఏళ్ళ ఉన్నాయని ఫస్ట్ అతని చదువు పూర్తి కావాలి.అసలు పెద్దయ్యాక ఏమవుతాడో కూడా తెలియదు.

ముఖ్యంగా అతడికి సినిమాల మీద ఆసక్తి లేదని తెలిపింది.ఏది చేసిన ఆర్ట్స్ లో డిగ్రీ చేస్తాడేమో మ్యూజిక్ నేర్చుకుంటాడు ఏమో అని చెప్పేసరికి మొత్తానికి అకిరా ఇండస్ట్రీ ఎంట్రీ లేదని తెలుస్తుంది.

తాజా వార్తలు