బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్త పై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.ఈ క్రమంలో హైదరాబాద్ లో పలుచోట్ల ముస్లింలు ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు.
తమ మనోభావాలను కించపరిచే రీతిలో మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ నీ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.
ఈ పరిణామంతో హైదరాబాద్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోని హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తి మేరకు యూట్యూబ్… ఆ వీడియోని తొలగించడం జరిగింది.
ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు కూడా నమోదయింది. భవానీనగర్, డబీర్‌పురా, రెయిన్ బజార్ పీఎస్‌లలో కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. మరోపక్క ఎమ్మెల్యే రాజాసింగ్ ధర్మం కోసం చావడానికైనా సిద్ధమంటూ తాజా పరిణామాలపై రియాక్ట్ అవుతున్నారు.